ఆది పురుష్ చిత్రం నుంచి మరొక అప్డేట్..!!

టాలీవుడ్ లో పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలలోనే నటిస్తూ ఉన్నారు. అలా నటిస్తున్న చిత్రాలలో ఆది పురుష్ సినిమా కూడా ఒకటి.. ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇటీవలే శ్రీరామనవమి కానుకకు ఈ చిత్రం నుంచి ఒక అదిరిపోయే పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు చిత్ర బృందం.. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించగా సీతగా కృతి సనన్ నటించింది. అలాగే రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు.

తాజాగా ఆది పురుష్ సినిమా నుంచి ఒక పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ని విడుదల చేశారు.. నేడు హనుమాన్ జయంతి పురస్కరించుకొని ఆది పురుష్ నుంచి హనుమంతుడి పోస్టర్ను విడుదల చేయడం జరిగింది చిత్ర బృందం. హనుమాన్ ధ్యానంలో ఉన్న పోస్టర్ను రిలీజ్ చేశారు ఈ పోస్టర్లో బ్యాక్ గ్రౌండ్ లో ప్రభాస్ కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్లుగా తెలుస్తోంది.

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.. మరి ఇప్పటివరకు ఈ సినిమాకి ఎలాంటి హైప్ నెలకొనలేదు.. ప్రభాస్ నటిస్తున్న మరొక చిత్రం సలార్.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను కూడా వీలైనంత త్వరగా ఈ ఏడాది విడుదల చేయడానికి పలు సన్నహాలు చేస్తున్నారు చిత్ర బృందం. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)