పొత్తుపై కల్యాణ్ క్లారిటీ..కమలం చేతుల్లోనే అంతా.!

వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తుపై క్లారిటీగానే ఉన్నారు..నెక్స్ట్ ఎన్నికల్లో 2014 కాంబినేషన్ తో వెళ్లాలని ఆయన భావిస్తున్నారు. అంటే టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి…ఇలా మూడు పార్టీలు కలిసి వెళితే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇక ఇదే ప్రతిపాదనని తాజాగా ఢిల్లీలోని బి‌జే‌పి పెద్దల ముందు పెట్టారని తెలిసింది. తాజాగా పవన్ ఢిల్లీకి వెళ్ళిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో వైసీపీ పాలనలో జరుగుతున్న అక్రమాలు, అరాచకాలపై ఫిర్యాదు చేశారని, అలాగే రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరినట్లు తెలిసింది.

ఇక రాజకీయ పరంగా చూసుకుంటే నెక్స్ట్ టి‌డి‌పితో కలిసి జనసేన, బి‌జే‌పితో వెళితే బాగుంటుందనే ప్రతిపాదన బి‌జే‌పి పెద్దల ముందు పెట్టారు. వైసీపీ విముక్త ఏపీ కావాలంటే, వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదు అని పవన్ భావిస్తున్నారు. అందుకే మూడు పార్టీల పొత్తుని చెప్పినట్లు తెలిసింది. అయితే దీనిపై బి‌జే‌పి పెద్దలు క్లారిటీ ఇవ్వలేదని తెలిసింది. ప్రస్తుతం బి‌జే‌పి సొంతంగా బలపడాలని అనుకుంటుందని, జనసేనతో కలిసి బలపడితే ఇంకా మంచిదని అనుకుంటుందట.

కానీ ఎక్కడా కూడా టి‌డి‌పితో పొత్తు బి‌జే‌పి పెద్దలు ప్రస్తావించలేదని తెలిసింది. దీంతో బి‌జే‌పికి టి‌డి‌పితో పొత్తు ఇష్టం లేదని తెలుస్తోంది. ఇప్పటికే టి‌డి‌పితో పొత్తు ప్రసక్తే లేదని రాష్ట్ర బి‌జే‌పి నేతలు చెబుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో పవన్ పొత్తులపై ఎలా ముందుకెళ్తారో చూడాలి.

ఒకవేళ బి‌జే‌పి ఆ ప్రతిపాదనకు ఒప్పుకోకపోతే..బి‌జే‌పిని వదిలేసి పవన్ టి‌డి‌పితో పొత్తు పెట్టుకుంటారా? లేక టి‌డి‌పిని పక్కన పెట్టి బి‌జే‌పితో కలిసి ముందుకెళ్తారా? అనేది చూడాల్సి ఉంది.