దిల్ రాజ్ భార్య ఇండస్ట్రీలోకి ఎంట్రీ.. ఎక్కడంటే..?

టాలీవుడ్లో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు పొందిన వారిలో దిల్ రాజు కూడా ఒకరు.. ఇండస్ట్రీలోని కూడా కొంతమంది భార్యలు పలు రకాలుగా నిర్మాణాలలో పాలుపంచుకుంటూ ఉన్నారు. అలా రాజమౌళి భార్య రమా కూడా కాస్ట్యూమ్స్ డిజైనర్గా పనిచేస్తోంది ..త్రివిక్రమ్ భార్య, సౌజన్య నిర్మాతగా మారి పలు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఆ జాబితాలో ఇప్పుడు దిల్ రాజు భార్య వైశ్యు రెడ్డి చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దిల్ రాజు భార్య వైశ్యు రెడ్డి సిని నిర్మాణ బాధ్యతలను చూసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Dil Raju blessed with baby boy, wife Vygha doing fine - News -  IndiaGlitz.com

త్వరలోనే నిర్మాతగా ఆమెను చూడవచ్చని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. హిట్ ఫస్ట్ కేసు మూవీని హిందీలో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. దిల్ రాజు నెక్స్ట్ హిందీ వెంచర్నిర్మానానికి తన భార్యనే హ్యాండిల్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక గత ఏడాది బ్లాక్ బాస్టర్ విజయాలను సాధించిన దర్శకుడు అనీస్ బాజ్మి డైరెక్షన్లో షాహిద్ కపూర్ హీరోగా నటించిన పోతున్నారు ఈ చిత్రానికి దిల్ రాజు భార్య వైశ్యు రెడ్డి నిర్మాతగా ఉండబోతుందని సమాచారం.

Dil Raju becomes a fatherదిల్ రాజు ఫ్యామిలీ నుంచి ఇప్పటికే తన కూతురు హన్సిత మేనల్లుడు హర్షిత్ రెడ్డి దిల్ రాజు ప్రొడక్షన్ పేరుతో నిర్మాణంలోకి అడుగుపెట్టారు. ఇక బలగం సినిమాని నిర్మించి మొట్టమొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు.. దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు ఆశీష్ రెడ్డి ఇటీవల రౌడీ బాయ్స్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా పరవాలేదు అనుకున్నప్పటికీ ఆశిష్ రెడ్డి తన తదుపరి ప్రాజెక్టుల పైన బిజీగా ఉన్నారు.