ట్రైలర్: మరొకసారి ఆకట్టుకుంటున్న శాకుంతలం ట్రైలర్..!!

సమంత నటించిన శాకుంతలం సినిమా ఈనెల 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా దుష్యంత, శకుంతల ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాని డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు.. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ సినిమాను నిర్మించడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్లు కూడా విడుదలై అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను చిత్ర బృందం విడుదల చేసింది.

Shaakuntalam Trailer: Samantha's Problems With Independent Decisions..  Emotional Shakuntalam Trailer!

శకుంతల వ్యధ రాకుమారుడుతో అందమైన ప్రేమ కథ అన్నట్టుగా ఈ సినిమా కనిపిస్తోంది. అంతకుమించి విజువల్ గ్రాఫిక్స్ పరంగా గుణశేఖర్ సాంకేతిక నిపుణులతో చాలా గ్రాండ్ వర్క్ చేయించినట్టుగా ఈ ట్రైలర్ చూస్తే మనకి కనిపిస్తోంది.. ముఖ్యంగా ప్రకృతి అందాలు ఇతర వాతావరణంలో చూపించిన సన్నివేశాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. శకుంతల ప్రేమలో పడిన రాజు దృశ్యంత్ ఆ తర్వాత తన జీవితంలో ఎలాంటి ఘటనలను సమంత ఎదుర్కొంటోంది అనే విషయం తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యేంతవరకు ఆగాల్సిందే..

ఈ చిత్రంలోని సమంత ఎప్పటిలాగానే అతను అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకుంటోంది.. ఇక మోహన్ బాబు కూడా ఈ చిత్రంలో మరొకసారి హైలెట్గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది ట్రైలర్ అద్భుతంగా ఉందని విఎఫ్ఎక్స్ కూడా బాగానే ఆకట్టుకుంటున్నాట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అభిజ్ఞాన శకుంతల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రనికి సంగీతాన్ని మణిశర్మ అందించారు. ఇందులో మోహన్ బాబు ,ప్రకాష్ రాజ్, మధుబాల ,గౌతమి తదితరులు కీలకమైన పాత్రలో నటించారు ఈ సినిమాని తెలుగు ,హిందీ ,తమిళ్, మలయాళం కన్నడ వంటి భాషలలో త్రీడీలో కూడా విడుదల చేస్తున్నారు.