తెలుగు సినీ పరిశ్రమలో ప్రేమించి పెళ్లి చేసుకున్న సెలబ్రెటీ కపుల్స్ లో రాజశేఖర్-జీవిత జంట ఒకటి. వీరిద్దరినీ వేరువేరుగా చూడటం అసలు సాధ్యం కాదు. రాజశేఖర్ అంటే జీవిత.. జీవిత అంటే రాజశేఖర్ అన్నంతలా వీరిద్దరూ మామేకం అయ్యారు. అయితే వీరి ప్రేమ కథలో ఎన్నో మలుపులు ఉన్నాయి. రాజశేఖర్ ను పొందడం కోసం జీవిత ఎన్నో కష్టాలు పడింది.
జీవిత, రాజశేఖర్ లు ఓ తమిళ సినిమా సెట్స్ లో కలుసుకున్నారట. అయితే హీరోయిన్ గా జీవిత బాగోలేదని రాజశేఖర్ మేకర్స్ కు చెప్పాడట. కానీ, ట్విస్ట్ ఏంటంటే.. రాజశేఖర్ నే తొలిగించి హీరోగా మరొకరిని తీసుకున్నారు. అలా విచిత్రంగా మొదలైన వీరి పరిచయం స్నేహంగా, ఆపై ప్రేమగా మారింది. తాజాగా ఓ షోలో పాల్గొన్న రాజశేఖర్-జీవిత తమ ప్రేమకథను పంచుకున్నారు.
రాజశేఖర్‌లో ఫ్రాంక్ నెస్ తనకు నచ్చిందని, అయితే ఆయన్ను పెళ్లికి ఒప్పించటానికి చాలానే కష్టపడ్డాడనని చెప్పారు జీవిత. ఇంతలో రాజశేఖర్ అందుకుని.. `తనను జీవిత ప్రేమిస్తుందనే విషయం తెలిసిన డైరెక్టర్ రాఘవేంద్రరావు ఆమెను పిలిచి, రాజశేఖర్ విలన్‌లా ఉన్నాడు. నమ్మకు అని సలహా కూడా ఇచ్చారు. అయినాసరే పట్టువీడని జీవిత నన్ను బ్రిడ్జిపై నుంచి తోసేసి, హాస్పటల్ లో చేర్పించి, సేవలు చేసి మా అమ్మనాన్నలతో పెళ్లికి ఓకే చెప్పించింది` అని పేర్కొన్నారు. అయితే `పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, కానీ నాతోనే ఉంటానని తెగేసి చెప్పింది. జీవితలోని ఆ ప్రేమే నచ్చింది, పెళ్లి చేసుకున్నాను` అంటూ రాజశేఖర్ ఈ సందర్భంగా వెల్లడించారు.