అల్లరి నరేష్‌ ఉగ్రం నుంచి బిగ్‌ అప్‌డేట్‌.. బేరం అదిరిపోయిందిగా..!

అల్లరి నరేష్ అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు వచ్చేది అతను కామెడీ హీరోనే.. కానీ నరేష్ ఈమధ్య తన రూట్‌ మార్చాడు. మంచి కథలు వస్తే చెయ్యాలని డిసైడ్ అయినట్టు వున్నాడు, అందుకే అది కామెడీ సినేమానా, లేక సీరియస్ సినేమానా అని చూడకుండా, కథకు ప్రాధాన్యత ఉన్న‌ సినిమాలే చెయ్యాలని అనుకున్నట్టుగా కనపడుతోంది.

Naandhi movie review: Allari Naresh's strong performance keeps this drama afloat | Entertainment News,The Indian Express

అందులో భాగంగానే వస్తున్న న‌రేష్ తాజా సినిమా ఉగ్రం అని అనుకోవాల్సి వస్తోంది. నరేష్ నటుడిగా కొత్తగా ఏమీ అందరికీ ప్రూవ్ చెయ్యాల్సిన పని లేదు. అతను కెరీర్ మొదట్లోనే ‘నేను’ , అలాగే ‘గమ్యం’ సినిమాలో గాలి శీనుగా ఇలా చాలా మంచి పాత్రలు చేసి తాను మంచి నటుడని ఎప్పుడో చెప్పకనే చెప్పాడు.

Allari Naresh: రేపు అక్కినేని హీరో చేతుల మీదుగా 'ఉగ్రం' టీజర్ లాంచ్

అయితే ఎటువంటి నటుడికి అయినా అప్పుడప్పుడూ ఒక మంచి బ్రేక్ అంటూ పడాలి కదా. అదే ఇప్పుడు నరేష్ కి కావలసింది. అది ‘ఉగ్రం’ రూపంలో వస్తుంది అని అంటున్న‌రు. దీనికి విజయ్ కనకమేడల దర్శకుడు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇంతకు ముందు అంటే 2021లో ‘నాంది’ అనే చిత్రం వచ్చింది. అందులో కూడా నరేష్ చాలా బాగా నటించాడు, ఆ సినిమా ఆలోచించ తగ్గ చిత్రంగా ఉంటుంది.

Allari Naresh's next titled Ugram - Filmify.in

ఇంకోలా చెప్పాలంటే ఆ సినిమా నరేష్ రూట్ మార్చే దిశగా చేసింది. ఎప్పుడూ కామెడీ సినిమాలు చేసే నరేష్ కొంచెం యాక్షన్, థ్రిల్లర్, చిన్న సామజిక సందేశం వున్న సినిమాలను చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రాబోయే ‘ఉగ్రం’ ఒక యాక్షన్ సినిమాలా కనపడుతోంది. ఇప్ప‌టికే టీజ‌ర్, ట్రైల‌ర్ చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఈ సినిమాలో న‌రేష్ పోలీస్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌డు.

अल्लारी नरेश की फिल्म 'उग्रम' का फर्स्ट लुक आउट, नंदी के बाद विजय के निर्देशन में फिर करेंगे काम! - telugu star allari naresh ugram first look out watch here south bhojpuri –

ఇదిలా ఉంటే మే 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ మూవీకి సంబంధించి థీయాట్రికల్ బిజినెస్ పూర్తయ్యిందని తెలుస్తోంది. మొత్తం రూ.4 నుంచి రూ.5 కోట్ల మేర‌ థీయాట్రికల్ బిజినెస్ జరిగిందని టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమాకి సంభందించి అన్ని ఏరియ‌ల రైట్స్ కూడా అమ్ముడైపోయినట్లు తెలుస్తుంది. ఈ సినిమాతో న‌రేష్ ఎలాంటి రిక్డాలు క్రియెట్ చేస్టాడో చూడాలి.