`నాని 30`కి క్రేజీ టైటిల్‌.. ఇంత‌కీ క‌థ ఏంటి..?

ఇటీవ‌ల `ద‌స‌రా` సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న న్యాచుర‌ల్ స్టార్ నాని.. ప్ర‌స్తుతం త‌న 30వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వైరా ఎంటర్‌టైన్మెంట్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మ‌వుతున్న‌ ఈ సినిమాకు శౌర్యవ్ అనే కొత్త వ్య‌క్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

ఇందులో నానికి జోడీగా `సీతారామం` ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా క‌నిపించ‌బోతోంది. నాని 30 వ‌ర్కింగ్ టైటిల్ తో ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 21న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

అయితే తాజాగా ఈ మూవీ టైటిల్ కు సంబంధించి ఓ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. ఈ చిత్రానికి మేక‌ర్స్ తాజాగా `హాయ్ నాన్న` అనే క్రేజీ టైటిల్ ను లాక్ చేశార‌ని అంటున్నారు. తండ్రి కూతుళ్ళ అనుబంధం బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ సాగుతుంది. విడాకులు తీసుకున్న భార్య భర్తల మధ్య నలిగిపోయే చిన్నారి పాత్ర కోణంలో ఈ సినిమా క‌థ న‌డుస్తుంద‌ని ఇండస్ట్రీ వర్గాలలో ప్ర‌చారం జ‌రుగుతోంది.