బిరుదులు మార్చుకున్న టాప్ టాలీవుడ్ హీరోలు.. ఇప్పుడు వారి బిరుదులు ఏంటంటే..

సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లను వారి ఇంటి పేర్లతో కాకుండా కొన్ని ప్రత్యేక పేర్లను చేర్చి పిలుస్తుంటారు. అలా చిరంజీవి నటనను చూసి ఒకప్పుడు సుప్రీం హీరో అన్నారు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి అంటున్నారు. ఇక ఇప్పుడున్న యంగ్ హీరోలు కూడా వారి నటనాశైలిని భట్టి వారికున్న బిరుదులను మార్చుతున్నారు. లేటెస్ట్‌గా మెగా హీరో రామ్ చరణ్‌ను కొత్త పేరుతో పిలుస్తున్నారు. ఇటీవల ఆయన స్థాయి అంతర్జాతీయ లెవెల్‌కి వెళ్లింది. దీంతో ఇప్పటి వరకు ఉన్న ‘మెగా పవర్ స్టార్’ బిరుదు కాస్త ‘గ్లోబల్ స్టార్’గా మారిపోయింది. అలానే ఏ హీరోకి ఎలాంటి బిరుదులు ఉన్నాయో, ఆ తరువాత ఎలా మారాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

• బాలకృష్ణ

నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన బాలకృష్ణకు తండ్రి ఎన్టీఆర్ కు ఉన్న నటరత్న బిరుదు నుంచి యువరత్నగా బిరుదు ఇచ్చారు. ఇక ఈ శతాబ్దంలో వచ్చిన సింహా సినిమాతో ‘నట సింహా’ అని పిలుస్తున్నారు.

• మహేష్ బాబు

తండ్రి సూపర్ స్టార్ కృష్ణ వారసుడు కాబట్టి మహేష్ బాబును మొదట్లో ప్రిన్స్ అని పిలిచేవారు. ఆ తరువాత పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన పోకిరీ మూవీ నుంచి ఆయనను ‘సూపర్ స్టార్’ అని పిలుస్తున్నారు.

నాగార్జున

అక్కినేని నాగేశ్వర్ రావుకు నట సామ్రాట్ అనే బిరుదు ఉండేది. దీని నుంచి ఆయన కుమారుడు నాగార్జునకు యువ సామ్రాట్ అని పెట్టారు. ఇక కింగ్ సినిమా సక్సెస్ అయిన తరువాత ‘కింగ్ నాగార్జున’ అని పిలుస్తున్నారు.

• రవితేజ

మాస్ యాక్షన్ తో మెప్పించే రవితేజను మాస్ హీరో అని పిలిచేవారు. ఆ తరువాత ఆయనను మాస్ మహరాజ అని పిలస్తున్నారు.

• రామ్ చరణ్

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన రామ్ చరణ్ ను తండ్రి మెగాస్టార్, బాబాయ్ పవర్ స్టార్ నుంచి తీసుకొని మెగా పవర్ స్టార్ అని పిలిచేవారు. కానీ ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయన రేంజ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. దీంతో ఆయన బిరుదుని గ్లోబల్ స్టార్ గా మార్చేశారు.