విలన్‌గా వచ్చి స్టార్ హీరోలుగా ఇమేజ్ తెచ్చుకున్న టాలీవుడ్ నటులు వీరే..!

సాధారణంగా చిత్ర పరిశ్రమలో అవకాశం లభిస్తే చాలు అనుకుని ఇండస్ట్రీ లోకి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. ఏదో ఒక పాత్ర దొరికితే చాలు అన్నట్టుగా విలన్ పాత్రలకు కూడా ఓకే చెప్పి మొదట ఇండస్ట్రీలోకి వచ్చి ఆ తర్వాత తమ నటనతో స్టార్ హీరోలుగా మెప్పించిన నటులు చాలామంది ఉన్నారు. నిజానికి ఏ సినిమాకైనా సరే.. హీరోకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. విలన్ కి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది.

18 Powerful Negative Villain Roles Played By Telugu Actor | Tollywood Anti  Hero Movies - YouTube

విలన్ లేకపోతే హీరోనే ఉండడు. విలన్ పాత్ర ఎంత స్ట్రాంగ్ గా ఉంటే హీరో పాత్ర అంత బలంగా చూపించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా హీరో పాత్రతో పోల్చుకుంటే విలన్ పాత్రకి ఎక్కువ డిమాండ్ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విలన్ పాత్రలు కొంతమంది నటుల కెరీర్‌ను మార్చేశాయి. ముందుగా పరిశ్రమంలోకి హీరో అవుదామని వచ్చి.. విలన్ పాత్రలతో సరిపెట్టుకుని ఆ తర్వాత స్టార్ హీరో ఇమేజ్‌ని సొంతం చేసుకున్న నటుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చిరంజీవి:
చిరంజీవి బాడీ లోనే రిధం ఉంటుందని అందరూ అంటూ ఉంటారు. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ముఖ్యంగా మాటలు.. మేనరిజం.. డాన్స్ అన్ని కూడా వేరే లెవెల్ అన్నట్టుగా ఉంటాయి. అయితే చిరంజీవి మొదటిసారి.. ఇది కథ కాదు , మోసగాడు, న్యాయం కావాలి వంటి చిత్రాలలో విలన్ గా నటించారు . ఆ తర్వాత మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.


మోహన్ బాబు:
ఈయన కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కొదమసింహం, సర్దార్ పాపారాయుడు , అడవిదొంగ వంటి సినిమాల‌లో నెగిటివ్ పాత్రలు పోషించి.. ఆ తర్వాత కలెక్షన్ కింగ్ గా గుర్తింపు సొంతం చేసుకున్నారు.


జెడి చక్రవర్తి:
గులాబి, ప్రేమకు వేళాయరా వంటి సినిమాలలో లవర్ బాయ్ గా కనిపించిన జెడి కూడా శివ సినిమాలో విలన్‌గా నటించాడు.

గోపీచంద్:
మ్యాచో మ్యాన్ గోపీచంద్ కూడా తొలివలపు సినిమాలో హీరోగా నటించినా అనుకున్న సక్సెస్ అవ్వకపోవడంతో విలన్ గా వర్షం, జయం, నిజం సినిమాలలో తన నటనతో ప్రేక్షకులను భయపెట్టాడు.

The fall and rise of Rajasekhar!

రాజశేఖర్:
తలంబ్రాలు సినిమాలో విలన్ గా నటించి.. ఆ పాత్రకు నంది అవార్డును కూడా సొంతం చేసుకున్న రాజశేఖర్ ఆ తర్వాత హీరోగా సక్సెస్ అందుకున్న‌డు.