ఆ పార్ట్ కు స‌ర్జ‌రీ చేయించుకున్న ర‌ష్మిక‌.. వామ్మో ఇలా తయారైందేంటి?

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజా లుక్ చూసి అభిమానులు షాక్ అయిపోతున్నారు. వామ్మో రష్మిక ఇలా తయారైందేంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు. బాలీవుడ్ హంగామా స్టైల్ ఐకాన్ అవార్డ్స్ ఈవెంట్‌కు ర‌ష్మిక హాజరయ్యారు. బ్లాక్ అండ్ సిల్వ‌ర్ క‌ల‌ర్ డ్రెస్ లో సూప‌ర్ స్టైలిష్ గా కనిపిస్తూ అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

ఇందులో సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే ఈ పిక్స్ లో రష్మిక చిరునవ్వులో, పెదవులు చాలా భిన్నంగా కనిపించాయి. రష్మిక కొత్త లుక్‌ను చూసిన అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ర‌ష్మిక లిప్స్ కు స‌ర్జ‌రీ చేయించుకుంద‌ని.. అందుకే ఇలా మారిపోయిందంటూ కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మేకప్ ప్రభావం కావచ్చునని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మ‌రి ఈ విష‌యంపై ర‌ష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ర‌ష్మిక అల్లు అర్జున్ కు జోడీగా `పుష్ప 2` సినిమాలో న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్ లో ర‌ణ‌బీర్ క‌పూర్ స‌ర‌స‌న `యానిమ‌ల్` అనే సినిమా చేస్తోంది. ఈ మూవీకి `అర్జున్ రెడ్డి` ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.