వైసీపీలోకి జేడీ..విశాఖలోనే పోటీ.?

సి‌బి‌ఐ మాజీ జే‌డి లక్ష్మీనారాయణ వైసీపీలోకి వెళుతున్నారా? అంటే తాను చెప్పిన పని చేస్తే వైసీపీలోకి వెళ్లడానికైనా రెడీ అని ఆయన అంటున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే అంశంపై క్లారిటీ ఇచ్చారు. నెక్స్ట్ ఖచ్చితంగా విశాఖ ఎంపీగానే పోటీ చేస్తానని, కానీ ఏ పార్టీలో నుంచి పోటీ చేస్తానో చెప్పలేను అని అంటున్నారు.

కాకపోతే గ్రామీణాభివృద్ధి, ఉద్యోగాలు, వ్యవసాయం..ఈ మూడు రంగాలకు సంబంధించి తన వద్ద కొన్ని ప్రణాళికలు ఉన్నాయని వాటిని అమలు చేసే పార్టీలో చేరతానని అన్నారు. అంటే తాను చేరేప్పుడు ఏ పార్టీ తన ప్రణాళికలని అంగీకరిస్తుందో..ఆ పార్టీలో చేరతానని అంటున్నారు. అయితే గత ఎన్నికల్లో ఈయన జనసేన తరుపున పోటీ చేసి విశాఖ ఎంపీగా దాదాపు 3 లక్షల ఓట్ల వరకు తెచ్చుకున్నారు. ఈయన ఓట్లు చీల్చడం వల్ల విశాఖ ఎంపీ స్థానంలో టి‌డి‌పి 4 వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. వైసీపీ గెలిచింది.

ఇప్పుడు కూడా విశాఖలోనే పోటీ చేస్తానని అంటున్నారు. అయితే ఈయన మళ్ళీ జనసేనలోకి వెళ్తారో లే  దో క్లారిటీ లేదు. కాకపోతే ఈయన వైసీపీ కూడా ఆఫర్ ఇచ్చిందని తెలిసింది. 2019 ఎన్నికల సమయంలోనూ తననున వైసీపీలోకి రమ్మన్నారని లక్ష్మీ నారాయణ వెల్లడించారు. కానీ తాను అనుకున్న ప్రణాళికలు అంగీకరిస్తే పార్టీలోకి వస్తానని చెప్పారట. వైసీపీ నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిసింది.

విశాఖ నుంచి తిరిగి తాను పోటీ చేయటం ఖాయమని లక్ష్మీనారాయణ స్పష్టం చేసారు. తాను కోరుకొనే అంశాల పైన పార్టీలు చర్చకు సిద్దమైతే వారితో కలుస్తానని..లేకుంటే తాను స్వతంత్రంగానే బరిలోకి దిగేందుకు సిద్దమని తేల్చి చెప్పారు.