`గేమ్ ఛేంజర్‌`గా రామ్ చ‌ర‌ణ్‌.. ఈ బ్యాడ్ సెంటిమెంట్ కు బ‌లైపోడు క‌దా?

`ఆర్ఆర్ఆర్‌` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. `ఆర్సీ 15` వర్కింగ్ టైటిల్ తో గ‌త ఏడాదే సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

అలాగే అంజలి, జయరామ్‌, శ్రీకాంత్, సునీల్, ఎస్‌.జే. సూర్య‌ తదితరులు కీలక పాత్రల‌ను పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే నేడు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఈ మూవీ టైటిల్ ను రివీల్‌ చేశారు. `గేమ్ ఛేంజర్‌` అనే టైటిల్ ను ఈ చిత్రానికి లాక్ చేశారు.

అయితే ఈ టైటిల్ విష‌యంలో మెగా ఫ్యాన్స్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఒక సినిమాకు మంచి క్రేజ్‌ తీసుకొచ్చేది మేయిన్‌ టైటిలే. అలాంటి టైటిల్‌ను ఎప్పుడో కానీ పలకని పదాలు పెడితే సినిమాకు పెద్ద మైన‌స్ అవుతుంది. ఇక‌పోతే గత రెండు, మూడు దశాబ్దాలుగా ఎన్నో తెలుగు సినిమాలు ఇంగ్లీష్ టైటిల్స్‌తో రిలీజయ్యాయి. అయితే వాటిల్లో విజ‌యాలు సాధించ‌న‌వి చాలా త‌క్కువ‌. దీంతో ఇంగ్లీష్ టైటిల్ తో వ‌స్తే సినిమా ఫ్లాప్ అన్న బ్యాడ్ సెంటిమెంట్ టాలీవుడ్ లో ఉంది. ఈ నేప‌థ్యంలోనే `గేమ్ ఛేంజర్‌`గా వ‌స్తున్న రామ్ చ‌ర‌ణ్ ఎక్క‌డ ఈ బ్యాడ్ సెంటిమెంట్ కు బ‌లైపోతాడో అని ఫ్యాన్స్ కాస్త ఆందోళ‌న చెందుతున్నారు.