మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ కు గుడ్ బై చెప్పనున్నారా..?

క్రికెట్ ప్రియులకు మహేంద్రసింగ్ ధోని అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. ఓడిపోయే మ్యాచ్లను కూడా ఎన్నోసార్లు గెలిపించి మంచి పాపులారిటీ సంపాదించారు మహేంద్రసింగ్ ధోని. ధోని క్యాప్టెన్షిప్ లో ఎన్నో విజయాలను కూడా అందించారు. ధోని 2014లో టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకొని 2020 వరకు వన్డే t20 జట్లలో కొనసాగారు.. ఆ తర్వాత 2020 ఆగస్టు 15 అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ప్లాట్ ఫామ్ లో నుంచి తప్పుకోవడం జరిగింది. ఇక అప్పటి నుంచి ధోని కేవలం ఐపిఎల్ లో మాత్రమే ఆడుతున్నారు.

IPL 2023: How did MS Dhoni sweeten the relationship between CSK-Jadeja?  Jaddu was upset after being stripped of the captaincy
మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్న.. ఐపీఎల్ -16 కు ధోని చివరిగా ఆడబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మెగా టోర్నీ అనంతరం రిటైర్మెంట్ ప్రకటిస్తారని ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది . దీనిపై మహేంద్ర సింగ్ ధోని ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ అది ఆవాస్తవం అన్నట్లుగా వార్తలు వినిపించాయి. ఈ విషయంపై చాట్ జీడిపీటీని అడగ్గా అది ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. రిటైర్మెంట్ అనేది ఆటగాళ్ల వ్యక్తిత్వ నిర్ణయం ధోని విషయంలో కూడా అంతే నా వద్ద ధోనీ కి సంబంధించిన అంతర్గత సమాచారం గానీ అతడి వ్యక్తిగత ఆలోచనలకు ప్రణాళికలకు సంబంధించిన సమాచారం లేదని తెలుపుతుంది.

2023 తర్వాత ధోని రిటైర్మెంట్ అవుతారో లేదో ఖచ్చితంగా అంచనా వేయలేమని ధోని రిటైర్మెంట్ తీసుకోవాలా వద్దా అనేది అతడి ఫిట్నెస్ ఫామ్ వంటి అనేక అంశాల పైన ఆధారపడి ఉంటుందని వీటి ఆధారంగానే అతని నిర్ణయం తీసుకుంటారని తెలిపింది.. ఈ అంశంలోని నేను ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేనని.. ఒక సమాచారం మీ అంచనా రాయడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను అంటూ చాట్ జిపిటి విశ్లేషకులు సమాధానాన్ని ఇచ్చారు. అచ్చం మనిషిలాగ ఆలోచిస్తూ కచ్చితత్వంలో సమాధానాలు ఇస్తున్న చాట్ జిపిటిని ఆదరించే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

https://twitter.com/ImTanujSingh/status/1640208530539155456?s=20