గిద్దలూరుపై టీడీపీ పట్టు..ఆ మెజారిటీ కరుగుతుందా?

తెలుగుదేశం పార్టీ 1999 ఎన్నికల్లో సత్తా చాటి..ఆ తర్వాత నుంచి సత్తా చాటని నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. అప్పటినుంచి గెలుపుకు దూరమైంది. అలా గెలుపుకు దూరమైన స్థానాల్లో గిద్దలూరు కూడా ఒకటి. ఇక్కడ చివరిగా టి‌డి‌పి గెలిచింది 1999 ఎన్నికల్లోనే..2004 నుంచి వరుసగా ఓడిపోతూ వస్తుంది. 2004లో కాంగ్రెస్, 2009లో ప్రజారాజ్యం, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ వరుసగా గెలుస్తూ వస్తుంది.

అయితే 2014లో వైసీపీ నుంచి గెలిచిన అశోక్ రెడ్డిని టి‌డి‌పిలోకి తీసుకున్నారు. అయినా సరే గిద్దలూరుపై టి‌డి‌పికి పట్టు దొరకలేదు. ఇక 2019 ఎన్నికల్లో టి‌డి‌పి దారుణమైన ఓటమిని చవిచూసింది. దాదాపు 81 వేల ఓట్ల భారీ మెజారిటీతో టి‌డి‌పి ఓడిపోయింది. రాష్ట్రంలో ఇది సెకండ్ హయ్యెస్ట్ మెజారిటీ. వైసీపీ నుంచి అన్నా రాంబాబు గెలిచారు. ఇంత మెజారిటీతో గెలిచిన రాంబాబు..అందుకు తగ్గట్టుగా పనిచేయడం లేదు. నియోజకవర్గంలో అభివృద్ధి తక్కువ..ప్రజా సమస్యలు పెద్దగా పరిష్కారం కావడం లేదు..ఏదో సంక్షేమ పథకాలు అమలు తప్ప..గిద్దలూరుకు పెద్దగా ఒరిగింది ఏమి లేదు.

దీంతో ఎమ్మెల్యేపై వ్యతిరేకత వస్తుంది..ఈ క్రమంలోనే వైసీపీ శ్రేణులు టి‌డి‌పి వైపుకు వెళుతున్నారు. అశోక్ రెడ్డి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులని టి‌డి‌పిలోకి తీసుకొస్తున్నారు. ఇలా టి‌డి‌పి బలాన్ని పెంచుతున్నారు. అయితే టి‌డి‌పి బలం ఎంత పెరిగిన..ఆ 81 వేల మెజారిటీని కరిగించడం మామూలు విషయం కాదు. ఆ మెజారిటీ దాటి టి‌డి‌పి బలం పుంజుకోవాలి. ఇప్పుడున్న పరిస్తితుల్లో మెజారిటీ తగ్గించింది గాని..వైసీపీని దాటినట్లు కనబడలేదు.

దీంతో టి‌డి‌పి ఇంకా కష్టపడాల్సి ఉంది. ఒకవేళ రాష్ట్రంలో గాలి మారితే గిద్దలూరులో టి‌డి‌పికి గెలిచే ఛాన్స్ వస్తుంది. లేదంటే మళ్ళీ గిద్దలూరులో టి‌డి‌పి గెలవడం కష్టమే.