అందంగా మారేందుకు రామ్ చ‌ర‌ణ్ ఆ స‌ర్జ‌రీలు చేయించుకున్నాడ‌ని మీకు తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి తనయుడిత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనదైన టాలెంట్ తో అంచలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ లో టాప్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్. రంగస్థలంతో త‌నలోని న‌టుడిని బ‌య‌ట‌కు తీశాడు. `ఆర్ఆర్ఆర్‌` తో గ్లోబ‌ర్‌ స్టార్ గా అవతరించాడు. ఈ మూవీకి ఆస్కార్ రావ‌డంతో హాలీవుడ్ ఫిల్మ్ మేక‌ర్స్ ను ఆక‌ర్షించాడు.

కేవ‌లం న‌ట‌న‌తోనే కాకుండా త‌న స్టైలిష్ లుక్స్ తో అమెరిక‌న్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. అయితే కెరీర్ ఆరంభంలో రామ్ చరణ్ ఇప్పుడున్న లాగా లేడు. అప్పట్లో ఆయ‌న స్వరూపం మరోలా ఉండేది. దీంతో చిరంజీవి కొడుకు అయితే ఎలా ఉన్నా హీరో అయిపోతాడా అంటూ చ‌ర‌ణ్ ను ఎంద‌రో ట్రోల్స్ చేశారు.

 

దీంతో ఆయ‌న అందంగా మారేందుకు స‌ర్జ‌రీలు చేయించుకున్నాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. ముఖం, గ‌డ్డం మ‌రియు దవడలకు ముంబైలోని ఓ హాస్పిటల్ లో స‌ర్జ‌రీలు చేయించుకున్నారని చెబుతూ ఉంటారు. కొంతమేర ఇలాంటి సర్జరీల తర్వాత రామ్ చరణ్ మొహం పూర్తిగా మారిపోయింది. అప్ప‌టి, ఇప్ప‌టి ఫోటోలు చూస్తే ఈ విష‌యం అంద‌రికీ స్ప‌ష్టంగా అర్థం అవుతుంది.