నారా రోహిత్ కెరియర్ ముగిసినట్టేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతమంది సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నటీనటులు ఉన్నారు. అలాంటి వారిలో నారా రోహిత్ కూడా ఒకరు.మొదట బాణం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ నటుడు చంద్రబాబు నాయుడు తమ్ముడు కొడుకు.. నారా రోహిత్ మొదటి సినిమాతోనే అందరిని బాగా అట్రాక్టివ్ గా చేశారు. ఈ సినిమాతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అయితే సాధించలేదని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో వచ్చిన సోలో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు నారా రోహిత్.

Nara Rohit Talks About His New Body Transformation Midst The Quarantine
ఈ సినిమా హిట్ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ కూడా ఘోరమైన డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో నారా రోహిత్ క్రేజ్ అమాంతం తగ్గిపోయింది. దీనికి తోడుగా ఆయన రొటీన్ కథల సినిమాలను కాకుండా వెరైటీగా ఉండే డిఫరెంట్ సినిమాలు తీయడం మొదలుపెట్టారు. ఇవీ కూడా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాయి. ఇక నారా రోహిత్, శ్రీ విష్ణు వంటి హీరోలతో కలిసి కొన్న సినిమాలో చేసిన అవి కూడా ఫెయిల్యూర్ గాని మిగిలాయి. శమంతకమణి అనే చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో నటించారు నారా రోహిత్.

ఈ సినిమాతో నైనా తనకి మంచి పేరు వస్తుందని భావించారు. ఇప్పుడు సినిమాలు చేయకుండా పొలిటికల్ వైపు అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. తన పెదనాన్న అయినా చంద్రబాబు నాయుడు కి సపోర్ట్ చేస్తూ.. అయినా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తూ తిరుగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే నారా రోహిత్ కూడా ఇకమీదట సినిమాలు చేయడమే విషయం అర్థమవుతోంది. దీంతో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పి పొలిటికల్గా నారా రోహిత్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.