చిరు, నాగ్, వెంకీ భారీ మల్టీస్టారర్..ఆ కారణంతోనే ఆగిపోయిందా.. అసలు కథ ఇదే..!

ఇతర ఇండస్ట్రీతో పోలిస్తే టాలీవుడ్‌లో మల్టీస్టారర్స్ చాలా తక్కువగానే వచ్చాయి. ఇక మన పాత తరం సీనియర్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వంటి హీరోలు ఎన్నో మల్టీస్టారర్ సినిమాల్లో కలిసి నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అయితే ఏకంగా 10 సినిమాలకు పైగా కలిసి నటించారు. ఇక వారి తర్వాత తరం నటులుగా వచ్చిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున మాత్రం ఎప్పుడు కలిసి నటించలేదు. వారి అభిమానులు ఒప్పుకోరనే కారణంతో మరో హీరోతో కలిసి నటించడానికి వెనకడుగు వేస్తున్నారు మన తెలుగు హీరోలు.

The Demises Of NTR, ANR, Krishnam Raju And Krishna Marks The End Of The  Golden Era

అయితే ఇప్పుడు మన హీరోలు కూడా మారుతున్నారు. గతంలో వెంకటేష్, మహేష్ బాబు కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో నటించారు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఇండియన్ ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. ఈ మూవీ ఏకంగా ఎన్నో సంచలమైన రికార్డులను క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఈ సినిమాలోని నాటు నాటు పాట‌ ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా దక్కించుకుంది.

Nagarjuna hug & Venkatesh Kiss for Chiranjeevi

అయితే ఇప్పుడు వీటన్నింటికంటే ముందే ఓ భారీ మల్టీస్టారర్ సినిమాను ప్లాన్ చేశారట టాలీవుడ్ స్టార్‌ దర్శకుడు కే రాఘవేంద్రరావు. తన సినీ కెరీర్‌లో ఎందరోహీరోలకు ఎన్నో ఇండస్ట్రీ హిట్‌లు ఇచ్చిన రాఘవేందర్రావు.. తన వందో సినిమాగా ఓ భారీ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించాలనుకున్నారట. ఈ సినిమాలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లను హీరోగా అనుకున్నారట. ఈ సినిమాకు త్రివేణి సంగమం అనే టైటిల్‌ని కూడా ఫిక్స్ చేశార‌ట‌ రాఘవేంద్రరావు. అయితే ఈ ముగ్గురి హీరోలను ఒకే తెరపై చూపించాలని దర్శకేంద్రుడు చేసిన ప్రయత్నం మధ్యలోనే ఆగిపోయింది.

Raghavendra Rao: హీరోగా మారిపోయిన దర్శకేంద్రుడు | Director Raghavendra Rao  Signed Two Movies as Hero in Tollywood

దాంతో తన 100 సినిమాను అల్లు అర్జున్‌ను హీరోగా పరిచయం చేస్తూ గంగోత్రిని తెరకెక్కించారు.
టాప్ స్టార్లు చిరంజీవి, నాగ్, వెంకీ ఒకే సినిమాలో కనిపిస్తే… అది పెను సంచలనం క్రియేట్ చేసి ఉండేది. ఆ టైమ్‌లో వారికున్న క్రేజ్‌కు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిసేది. టాలీవుడ్‌లో ప్రయోగాత్మక చిత్రాలు కూడా పెరిగేవి. అప్పట్లో వర్కవుట్ కాకపోయినా ‘త్రివేణి సంగమం’ స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకంతో ఎప్పటికైనా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కించాలనే గట్టి పట్టుదలతో ఉన్నారట రాఘవేంద్రరావు.