అవకాశాలు ఇస్తారని చెప్పి ఆ డైరెక్టర్ డ్రైవర్ గా వాడుకున్నారు .. నాని..!!

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలలో దసరా కూడా ఒకటి. అలాగే రవితేజ నటించిన రావణాసుర చిత్రం కూడా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ రెండు సినిమాల కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దసరా సినిమా ఈనెల 30 వ తేదీన విడుదల కాబోతోంది. అలాగే రావణాసుర సినిమా ఏప్రిల్ 7 వ తేదీన విడుదల కాబోతున్నది. తాజాగా ఈ ఇద్దరు హీరోలు కలిసి ప్రమోషన్స్ ని మొదలుపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు వీరి కెరియర్ లో జరిగిన కొన్ని విషయాలను సైతం తెలియజేయడం జరిగింది.

Nani explains why Jersey, Ala Vaikunthapurramuloo Hindi remakes did not  work: 'It's not something audience is exploring on day 1' | Entertainment  News,The Indian Express
అవకాశాల గురించి మొదట నాని మాట్లాడుతూ తన ఫోటో ఆల్బమ్ పట్టుకొని ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగానని ఎక్కడా కూడా కనీసం తనని లోపలికి కూడా రానివ్వలేదని తెలిపారు. ఒక ఫోన్ కూడా రావట్లేదు కనీసం చిన్న పాత్ర కూడా ఎవరు అవకాశాలు ఇచ్చేవారు కాదని తెలియజేశారు. ఈ ప్రయత్నంలోనే ఒకరిద్దరు డైరెక్టర్లు చివరికి తనను డ్రైవర్గా కూడా వాడుకున్నారని అంతేకాకుండా రకరకాల పనులు చేయించేవారని తెలిపారు. చివరకు తన ఏటీఎంలో పండుగ బట్టల కోసం దాచుకున్న డబ్బులను కూడా వారికి ఉపయోగించాల్సి వచ్చింది అంటూ తెలిపారు.

ఇలాంటివన్నీ చూసి చిరాకేసి యాక్టింగ్ మన వల్ల కాదని నిర్ణయించుకున్నానని తెలిపారు నాని మరొకవైపు నాని కథను విన్న అభిమానులు అప్పట్లో ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్న నాని ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా పేరుపొందడం చాలా గర్వకారణంగా ఉంది అంటూ తెలియజేస్తున్నారు. ప్రస్తుతం నాని చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.