మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా చిరంజీవి అంటే తెలియని వారుండరు. చిరు చిత్ర పరిశ్రమకు వచ్చిన మొదటి రోజుల్లో ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ఆయనకి చిత్ర పరిశ్రమలో తెలిసిన వారు ఎవరూ లేకపోవడంతో అవకాశాలు సరిగా వచ్చేవి కాదు. అలాగే ఒకప్పటి టాప్ కమెడియన్ మరియు విలన్‌గా ఉన్న సుధాకర్ గురించి కూడా అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
చిత్ర పరిశ్రమలో సినిమాల అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే మెగాస్టార్ తో పాటు హరి ప్రసాద్, సుధాకర్ రూమ్ మేట్స్ గా ఉండేవారు. ఈ ముగ్గురు కలిసి సినిమా ఆఫీస్‌లకి వెళుతూ ఆడిషన్స్ ఇస్తూ అవకాశాల కోసం ఎదురుచూసేవారు. అలా ఒకానొక సమయంలో వీరికి తినడానికి తిండి కూడా దొరికేది కాదు. వీరి దగ్గర డబ్బులు కూడా ఉండేవి కావు అలాంటి సమయంలో కొన్నిసార్లు పస్తులు కూడా ఉండేవారు.
ఒకరోజు ఈ ముగ్గురు ఏం కూర చేసుకుందామని ఆలోచిస్తుండగా సుధాకర్ కి వాళ్ళ పక్కింట్లో ఒక ములక్కాయ చెట్టు కనిపించింది. వెంటనే గోడ ఎక్కి ఆ కాయలను కోసి కూర వండారు. ఆ వండుకున్న కూర ముగ్గురు వేసుకుని తింటుంటే.. అదే సమయంలో ఆ పక్కింటి ఆయన వచ్చి మా చెట్టు ములక్కాయలు కోస్తారా అంటూ పెద్ద గొడవ కూడా చేశారట. అంతేకాకుండా వాళ్లు తింటున్న కోరను కూడా లాక్కుని తీసుకువెళ్లిపోయాడట. అలా జరగడంతో వాళ్లకి ఎంతో అవమానంగా అనిపించిందట. ఆ తర్వాత రోజు నుంచి వాళ్ళు ఎంతో కసిగా ఆడిషన్స్‌కి వెళ్లి సెలెక్ట్ అయి సినిమాలు చేశారట. ఇక ఈ విషయాన్ని సుధాకర్ ఓ ఇంటర్వ్యూలో తన పాత రోజులని గుర్తు చేసుకున్నారు.