కేబినెట్ మార్పు..ఏడాదిలో జగన్ రిస్క్ చేస్తారా?

ఏపీలో ఎన్నికలకు ఇంకా కరెక్ట్ గా ఏడాది సమయం ఉంది..ఒకవేళ ముందస్తు ఎన్నికలకు ప్లాన్ చేసుకుంటే..సరిగా ఆరు నెలల్లోనే ఎన్నికలు జరుగుతాయి..ఇలాంటి తరుణంలో జగన్ కేబినెట్ మార్పులు చేయడానికి సాహసిస్తారా? అంటే చెప్పలేని పరిస్తితి. మీడియాలో మాత్రం మంత్రివర్గంలో మార్పులపై కథనాలు వస్తూనే ఉన్నాయి. జగన్ మరోసారి మంత్రివర్గంలో మార్పులు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే కొందరు మంత్రుల పనితీరుపై జగన్ అసంతృప్తిగా ఉన్నారని, వారిని పక్కన పెట్టేసి..వేరే వాళ్ళకు జగన్ ఛాన్స్ ఇస్తారని అంటున్నారు.

అయితే ఇప్పటికే జగన్ రెండుసార్లు మార్పులు చేశారు. మొదట మండలి రద్దు నేపథ్యంలో ఇద్దరిని మార్చి..ఇద్దరిని తీసుకున్నారు. ఆ తర్వాత 11 మంది పాతవాళ్లని కొనసాగించి..14 మంది కొత్త వాళ్ళని మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఇక 25 మంది మంత్రులు ఉన్నారు..వీరిలో ఇప్పుడు ముగ్గురు, నలుగురు మంత్రుల పనితీరు అసలు బాగోలేదని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వారి వల్ల పార్టీకి కూడా ఇబ్బందే అని, అందుకే వారిని మార్చడానికి జగన్ చూస్తున్నారని ప్రచారం నడుస్తోంది.

ఇదే క్రమంలో ఫైర్ బ్రాండ్ నాయకుడు కొడాలి నాని లాంటి వారిని మంత్రివర్గంలోకి తీసుకుంటే టి‌డి‌పిపై దూకుడుగా ముందుకెళ్తారని, టి‌డి‌పికి చెక్ పెట్టడానికి నాని ఉపయోగపడతారని కాబట్టి ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకుంటే బెటర్ అని జగన్ ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం వస్తుంది. అటు బాలినేని శ్రీనివాస్ రెడ్డిని సైతం మళ్ళీ మంత్రివర్గంలోకి తీసుకుంటారని అంటున్నారు. అంటే ఆల్రెడీ వీరు మొదట విడతలో మంత్రులుగా పనిచేసిన వారే.

అదే సమయంలో ఇటీవల ఎమ్మెల్సీలుగా గెలిచిన వారిలో ఇద్దరికి జగన్ ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారని ప్రచారం వస్తుంది. ఏదేమైనా గాని మంత్రివర్గంలో మార్పులు చేయాలని జగన్ చూస్తున్నారని అంటున్నారు. మరి ఎన్నికలకు ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో జగన్ మంత్రివర్గంలో మార్పులు చేస్తారో లేదో చూడాలి.