టీడీపీకి 4..వైసీపీకి 5..జరిగేది ఏది?

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కేవలం నాలుగు సీట్లే వస్తాయి..అసలు వైసీపీకి ఆ ఐదు సీట్లే వస్తాయి..అని చెప్పి అటు టి‌డి‌పి, ఇటు వైసీపీ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. అసలు నాలుగు, ఐదు సీట్ల కథ ఏంటో ఒకసారి చూస్తే..గతంలో టి‌డి‌పి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అప్పుడు వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలని టి‌డి‌పిలోకి తీసుకున్నారు. ఇక 2019 ఎన్నికల్లో టి‌డి‌పికి అదే 23 సీట్లు వచ్చాయి. ఇదే దేవుడు స్క్రిప్ట్ అని వైసీపీ నేతలు ఎగతాళి చేశారు.

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక టి‌డి‌పికి చెందిన నలుగురు, జనసేనకు చెందిన ఒక ఎమ్మెల్యేని అంటే ఐదుగురు ఎమ్మెల్యేలని లాక్కుంది. ఇక ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టి‌డి‌పికి క్రాస్ ఓటు చేశారు. అప్పుడు టి‌డి‌పికి 23 ఓట్లు రావడం, గెలవడం జరిగింది ఇదే దేవుడు స్క్రిప్ట్ అంటూ వైసీపీకి టి‌డి‌పి కౌంటర్ ఇచ్చింది. ఇక తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అలాగే వారికి చంద్రబాబు డబ్బులు ఆఫర్ కూడా ఇచ్చారని ఆరోపిస్తున్నారు.

ఇదే క్రమంలో ఈ అంశంపై కొడాలి నాని స్పందిస్తూ…తమ పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలని తీసుకున్నారని, వచ్చే ఎన్నికల్లో టి‌డి‌పికి ఆ నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారని విమర్శించారు. దీనికి టి‌డి‌పి గట్టి కౌంటర్లు ఇస్తుంది. తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలని వైసీపీ లాక్కుందని, అటు ఒక జనసేన ఎమ్మెల్యేని లాక్కుందని దీంతో వైసీపీ నెక్స్ట్ ఎన్నికల్లో ఐదు సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని టి‌డి‌పి ఫైర్ అవుతుంది.

అసలు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలని ఎంత పెట్టి కొన్నారో చెప్పాలని టి‌డి‌పి ఫైర్ అవుతుంది. మొత్తానికి ఇలా రెండు పార్టీలు విమర్శలు చేసుకుంటున్నాయి. కానీ ఈ విమర్శలు ఏవి వర్కౌట్ కావనే చెప్పాలి.