దసరా మూవీపై పబ్లిక్ టాక్ ఏంటి ఇలా ఉంది.. నానికి ఈసారి కూడా??

నేచరల్ స్టార్ నాని హీరోగా నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా ‘దసరా’. ఈ పక్కా మాస్ మసాలా సినిమాకి శ్రీకాంత్ ఒదెలా దర్శకత్వం వహించారు. దసరా సినిమా లో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

దసరా సినిమాని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. అలానే సంతోష్ నారాయనణ్ ఈ సినిమా కి సంగీతం అందించారు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా భారీ అంచనాలతో పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది దసరా సినిమా. అయితే ఈ సినిమా చూసిన చాలామంది ‘దసరా’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని అంటున్నారు.

నాని కెరీర్‌లోనే ఈ సినిమా బెస్ట్ గా నిలుస్తుందని చాలా మంది అంటున్నారు. అంతేకాకుండా ఇక నుంచి దసరాకి ముందు దసరా తరువాత అనేంత గొప్పగా నాని నటించాడని అని చెప్తున్నారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈసారి నాని బ్లాక్ బస్టర్ హిట్ అందుకోబోతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలోని మ్యూజిక్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. ఈ ఏడాది ఒక మంచి సినిమా చూసినా ఫీల్ వచ్చింది కామెంట్ చేసారు. కాకపోతే సినిమా కాస్త స్లో గా ఉందట. కానీ నాని, కీర్తి నటన ఇరగదిశారు అని పోస్ట్ పెడుతున్నారు ఆడియన్స్. అలా సినిమా చూసినా ప్రతీ ఒక్కరూ బ్లాక్ బస్టర్ అని చెప్తున్నారు.