మ‌హేష్ అరుదైన ఘ‌న‌త‌.. సౌత్ లోనే ఏకైక హీరోగా న‌యా రికార్డ్‌!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అరుదైన ఘనతను సాధించారు. సౌత్ లోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక హీరోగా రికార్డు సృష్టించాడు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వేదికల్లో ఆయనకు మొత్తం 38.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్ బుక్ లో 15 మిలియన్లు, ట్విట్టర్ లో 13.2 మిలియన్లు, ఇన్ స్టాగ్రామ్ లో 10.1 మిలియన్ల మంది మహేష్‌ బాబును ఫాలో అవుతున్నారు.

ప్రతి సోషల్ మీడియా అకౌంట్‌పైనా మహేష్ బాబు కు కోటికి తక్కువ కాకుండా ఫాలోవర్లు ఉండడం మరో విశేషం అని చెప్పాలి. సౌత్ లో ఈ స్థాయిలో ఫాలోవ‌ర్స్ మ‌రే హీరోకు లేర‌నే చెప్ప‌వ‌చ్చు. దీంతో మ‌హేష్ బాబు ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. కాగా, మ‌హేష్ బాబు గొప్ప న‌టుడు మాత్ర‌మే కాదు మంచి మ‌న‌సు ఉన్న వ్య‌క్తి కూడా. ఓవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ.. మ‌రోవైపు అనేక సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నాడు.

ఇప్పటి వరకూ దాదాపు వెయ్యికి పైగా చిన్నారుల‌కు హార్ట్ ఆపరేషన్లు తన సొంత ఖర్చుతో చేయించాడు మహేష్. తన సొంత గ్రామమైన బుర్రిపాలెంతో పాటు తెలంగాణలోని సిద్ధాపూర్ గ్రామాన్నిదత్తత తీసుకొని వాటిని అన్ని విభాగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. అలాగే మ‌రెన్నో సేవాకార్య‌క్ర‌మాలు చేస్తూ రియ‌ల్ హీరో అనిపించుకుంటున్నాడు.