ఆనంకు వైసీపీ చెక్..సీటు మారుస్తారా?

ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి‌డి‌పికి క్రాస్ ఓటు చేసిన నలుగురు ఎమ్మెల్యేలకు రాజకీయంగా చెక్ పెట్టాలని వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఈ నలుగురు టి‌డి‌పిలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి..అది కూడా వచ్చే ఎన్నికల ముందే వీరు టి‌డి‌పిలో చేరే అవకాశాలు ఉన్నాయి.

ఈ నలుగురికి టి‌డి‌పి సీట్లు ఇస్తుందో లేదో ఇంకా క్లారిటీ లేదు. అయితే వీరు ఎక్కడ పోటీ చేసిన ఓడించాలని వైసీపీ చూస్తుంది. ఇదే సమయంలో వెంకటగిరి వైసీపీ ఇంచార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి..ఆనం టార్గెట్ గా ఫైర్ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను వైసీపీ నుంచి వెంకటగిరిలో పోటీ చేస్తానని, దమ్ముంటే ఆనం కూడా అక్కడే పోటీ చేసి తనపై గెలవాలని సవాల్ చేస్తున్నారు. “ నీకు ఏ పార్టీ సిద్ధాంతం నచ్చుతుందో ఆ పార్టీలో చేరి వెంకటగిరి నుండి పోటి చెయ్యి, నేను వైసీపీ నుంచి పోటీ చేస్తా. ఎవరి స్థాయి ఏమిటో తెలుస్తుంది.’’ అని ఆయన సవాల్ విసిరారు. ఆత్మప్రభోదంసారం వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు ఎవరికో ఓటు వేస్తారో తేలిపోతుందని అంటున్నారు.

అయితే ఆనం నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ వెంకటగిరిలో పోటీ చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ టి‌డి‌పి నుంచి కురుగొండ్ల రామకృష్ణ ఉన్నారు..ఆయనే నెక్స్ట్ బరిలో దిగే ఛాన్స్ ఉంది. ఇక ఆనం నెల్లూరు సిటీ లేదా ఆత్మకూరు బరిలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. చూడాలి మరి ఆనం ఎక్కడ నుంచి పోటీ చేస్తారో.