విజయశాంతి నిర్మాతగా బాలకృష్ణ హీరోగా.. సెన్షేష‌న‌ల్ కాంబినేష‌న్‌…!

టాలీవుడ్ లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్స్ లో ఒకటి నందమూరి బాలకృష్ణ- విజయశాంతి వీరిద్దరూ కలిసి ఇప్పటికే టాలీవుడ్ లో 17 సినిమాలకు పైగా కలిసి నటిస్తే అందులో పది సినిమాలకు పైగా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు వీరి మధ్య కెమిస్ట్రీ కూడా ఎంతో సహజంగా ఉంటుంది, అందుకే ఆ రోజుల్లో వీరిద్దరూ లవ్ లో ఉన్నారు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా ఎన్నో రూమర్లు కూడా బయటకు వచ్చాయి.

NBK Vijayashanti: తెలుగు తెరపై‌ సూపర్ హిట్ జోడి బాలకృష్ణ, విజయశాంతి.. | Nandamuri Balakrishna Vijayashanti super hit combination in tollywood silver screen– News18 Telugu

అందులో చాలామంది అవి రూమర్స్ కాదు అవి నిజమే అని నమ్మిన వాళ్లు కూడా ఉన్నారు. ఆ రోజుల్లో ఈ రూమర్స్ నిజమో కాదో తెలియదు కానీ వీరిద్దరూ మాత్రం మంచి స్నేహితుడిగా ఉండేవారు. అప్పట్లో బాలయ్యతో పాటుగా చిరంజీవితో కూడా ఈమె ఎక్కువ సినిమాల్లో నటించింది. బాలకృష్ణతో 17 సినిమాల్లో నటిస్తే చిరంజీవితే ఏకంగా 19 సినిమాల్లో హీరోయిన్గా నటించింది. కానీ విజయశాంతి వీరిద్దరిలో బాలకృష్ణ మీదనే ఎక్కువ అభిమానం చూపించేది.

History means childhood .. Two movies released in one day .. 100 Days – Jsnewstimes

ఇక‌ ఆయనతో కలిసి ఒక సినిమాను కూడా నిర్మించిన విషయం అందరికీ తెలియకపోవచ్చు.సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి తో బాలయ్య చేసిన ‘నిప్పు రవ్వ’ సినిమాను విజయశాంతి స్వయంగా తన బ్యానర్లో నిర్మించింది. ఈ సినిమా ఆ రోజుల్లో కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేకపోయినా ఓవరాల్ గా యావరేజ్ సినిమాగా నిలిచింది. దీంతోపాటు ఈ సినిమా విడుదలైన రోజునే బాలకృష్ణ నటించిన మరో సినిమా బంగారు బుల్లోడు కూడా విడుదలైంది.

NBK Vijayashanti: తెలుగు తెరపై‌ సూపర్ హిట్ జోడి బాలకృష్ణ, విజయశాంతి.. | Nandamuri Balakrishna Vijayashanti super hit combination in tollywood silver screen– News18 Telugu

ఈ ఆ సినిమాలోని పాటలు సూపర్ హిట్ అవగా సినిమా మీద కూడా మంచి బజ్ క్రీయేట్‌ అయింది దీంతో ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. నిప్పురవ్వ సినిమా మాత్రం ఈ సినిమా తాకిడికి అది నిలవలేకపోయింది. దాని ఫలితంగా ఆ సినిమా కలెక్షన్లు కూడా ఆశాజనంగా రాకుండాా పోయాయి. దీంతో ఆ సినిమాకు నిర్మాతగా ఉన్న విజయశాంతి ఎంతో తీవ్రంగా నష్టపోయింది. దీంతో ఈ సినిమా తర్వాత మళ్లీ విజయశాంతి నిర్మాణరంగం వైపు తొంగి చూడలేదు.