కృష్ణుడు అలక..బాబు ఎంట్రీ..తునిలో టీడీపీ డౌన్!

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం టీడీపీలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇంతకాలం తునిపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు గాని..ఇప్పుడు టి‌డి‌పి అధిష్టానం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ముందుకెళుతుంది. యనమల రామకృష్ణుడు ఫ్యామిలీ చేతులో ఉన్న ఈ తునిలో ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. 1983 నుంచి 2004 వరకు వరుసగా గెలిచి..2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ వస్తుంది.

అయితే ఇప్పటికీ అక్కడ టీడీపీ పెద్దగా బలపడలేదని సర్వేల్లో తేలింది. మంత్రి దాడిశెట్టి రాజా బలంగా ఉన్నారు..మళ్ళీ తునిలో ఆయనకే గెలిచే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే తుని టి‌డి‌పి ఇంచార్జ్‌ని మార్చాలని డిమాండ్ వినిపిస్తుంది. యనమల సోదరుడు కృష్ణుడు నియోజకవర్గ బాధ్యతలని చూసుకుంటున్నారు. దీంతో ఆయనని తప్పించి తాజాగా యనమల కుమార్తె దివ్యని ఇంచార్జ్‌గా నియమించారు. దీంతో తునిలో టీడీపీ శ్రేణుల్లో కాస్త జోష్ వచ్చింది.

ఇదే సమయంలో కృష్ణుడు అలకపాన్పు ఎక్కారు. తనని సైడ్ చేసి దివ్యని ఇంచార్జ్‌గా పెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం తనని సంప్రదించకుండానే నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహంతో ఉన్నారు. ఇదే సమయంలో కృష్ణుడు..టీడీపీకి వ్యతిరేకంగా ముందుకెళ్తారనే ప్రచారం వస్తుంది. ఈ క్రమంలోనే చంద్రబాబు…కృష్ణుడుని పార్టీ ఆఫీసుకు పిలిపించుకున్నారు. దీంతో కృష్ణుడు..బాబుతో భేటీ కానున్నారు.

ఈ భేటీలో కృష్ణుడుకు బాబు కీలక హామీలు ఇచ్చి..ఆయనకు సర్ది చెప్పి తునిలో దివ్య గెలుపు కోసం సహకరించేలా చేయనున్నారని తెలుస్తోంది. చూడాలి మరి కృష్ణుడు వెనక్కి తగ్గి..దివ్య కోసం పనిచేస్తారో లేదో.