బాలయ్య కోసం పెద్ద డేరింగ్ స్టెప్ వేస్తోన్న స్టార్ డైరెక్ట‌ర్‌..!

నటసింహం నందమూరి బాలకృష్ణ మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ లోనే వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అఖండతో మొదలైన బాలయ్య విజయ పరంపర ఈ సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డి సినిమాతో మరో లెవల్ కు వెళ్ళింది. వీర సింహారెడ్డి ఎకంగా బాలయ్య కెరీర్ లోనే రూ.80 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి బాలయ్య సినిమాలోనే హైయెస్ట్ గ్రాస‌ర్‌గా నిలిచింది. ఇక దీంతో ప్రస్తుతం బాలయ్య- గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 108వ సినిమా చేస్తున్నాడు.

ఇటు సినిమాలతో పాటు మరోవైపు బుల్లితెరపై కూడా అన్ స్టాపబుల్ షో తో ఆల్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకున్నాడు. దీంతో బాలయ్య ఇప్పుడున్న ఫామ్ కి టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్లు అందరూ బాలయ్యతో సినిమా చేయాలని పంతం పట్టుకుని మరి కూర్చున్నారు. మరి ఇప్పుడు లిస్టులో చాలామంది పెద్ద డైరెక్ట‌ర్లే ఉన్నారు. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ అయితే బాలకృష్ణ కోసం ఓ పవర్ఫుల్ కథను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది.

Balakrishna's Paisa Vasool movie review and rating

అసలే పూరి జగన్నాథ్ వరుస అపజయాలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో పైసా వసూల్ అవకాశమిచ్చిన బాలయ్య ఆ సినిమాతో బాలకృష్ణ లోని కొత్త యాంగిల్ చూపించి సక్సెస్ అయ్యాడు. ఇక ఆ తర్వాత రామ్‌తో ఇస్మార్ట్ శంకర్ తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో లైగర్ వంటి పాన్ ఇండియా సినిమా తెరకెక్కించి భారీ డిజాస్టర్‌ను తన ఖాతాలు వేసుకుని తన సినీ కెరియర్ను పాతాళానికి పాడవేసుకున్నాడు.

 

ఈ సినిమా పూర్తయిన దగ్గర నుంచి పూరి జగన్నాథ్ ఎవరికీ కనిపించకుండా ఏం చేస్తున్నారనేది ఎవరికి తెలియడం లేదు. అయితే ఇప్పుడు గత రెండు నెలలుగా పూరి తన టీం తో గోవాకు వెళ్లి ఓ పవర్ఫుల్ కథను రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ స్టోరీ తో ఎలా అయినా బాలయ్యతో సినిమా తీసి తానేంటో మళ్లీ నిరూపించుకునీ తను వద్దన్నా హీరోలకు గట్టి ఆన్సర్ ఇవ్వాలని పూరి ఎంతో కసిగా ఉన్నాడు.

100% Sure Puri Jagannadh talking about Lion Balakrishna

పూరి, బాలయ్య కోసం రాసుకున్న కథ కూడా ఎంతో కొత్తగా ఉంటుందట. అలాగే తండ్రి కొడుకులు మధ్య సాగే ఈ కథలో ఎంతో ఎమోషన్ కూడా ఉండబోతుందట. కాగా ఈ సినిమాలో ఎమోషన్ కన్నా ముఖ్యంగా యాక్షన్ బెస్ట్ గానే ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. అనిల్ రావుపూడి సినిమా కంప్లీట్ అయిన వెంటనే బాలయ్యతో పూరి సినిమాా ఉండబోతుందని తెలుస్తుంది.