మళ్లీ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన రష్మిక..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది హీరోయిన్ రష్మిక. రష్మిక ఎలాంటి విషయం అయినా షేర్ చేసిందంటే చాలు ఆ విషయం చాలా వైరల్ గా మారుతూ ఉంటుంది.. తాజాగా సంతోషంగా ఉండండి ఆశగా జీవించండి మీ సంతోషం శాంతి అన్నిటికంటే చాలా ఎక్కువ ప్రతికూల భావాలను విడిచిపెట్టండి ఎందుకంటే జీవితం చాలా చిన్నది అంటూ ఈ అందమైన కొటేషన్ను రాసుకొచ్చింది రష్మిక. తనతో పాటు అందరిని ఆనందంగా జీవించాలని కోరుకుంటుంది. దీంతో రష్మిక ఫ్యాన్స్ లవ్ హాట్ ఇమేజ్ లతో చాలా లైక్ చేస్తున్నారు.

Rashmika Mandanna Drops Motivating Note For Her Fans, Asks Them To 'Be Happy'

ఈ కొటేషన్ తోపాటు రష్మిక కొన్ని ఫోటో గ్రాఫ్ ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటో గ్రాఫర్ రష్మిక థైస్ స్లిట్ డిజైనర్ డ్రెస్ మతులు పోగొట్టేలా కనిపిస్తోంది. ఇలా అల్ట్రా స్టైలిష్ డిజైన్ అంటూ కితాబు ఇస్తూ ఉన్నారు అభిమానులు. పుష్ప చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా నటించిన ఈ ముద్దుగుమ్మ ఇలా లేటెస్ట్ డిజైనర్ లుక్ లో మరింత క్లాస్ గా ఆకట్టుకుంటోంది. రష్మిక టాలీవుడ్ బాలీవుడ్ లో బిజీ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. సంక్రాంతి బరిలో తమిళ డబ్బింగ్ సినిమా వారితో అటు తమిళ్ ,తెలుగులో కూడా బాగానే ఆకట్టుకుంది.

Image
బాలీవుడ్లో సిద్ధార్థ మల్హోత్రా సరసన నటించిన మిషన్ మజ్ను చిత్రం విమర్శకులం నుంచి ప్రశంసలు అందుకుంది. ఇందులో రష్మిక నటనకు పేరు వచ్చినట్లుగా తెలుస్తోంది.బిజీగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ అంతలోనే స్వస్థలం కూర్గ్ కి వెళ్లేందుకు కొంత సమయం కేటాయించినట్లుగా తెలుస్తోంది రస్మిక ఒక పూజ కోసం తన సొంత ఊరు కూర్గ్ కి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారుతోంది.