ఎన్టీఆర్ 30తో జాన్వీ ఎంట్రీపై శ్రీ‌దేవి ఫ్యాన్స్ అసంతృప్తి.. కారణం అదేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్కినున్న సంగ‌తి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వ‌ర్కింగ్ టైటిల్ తో ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ మూవీని నిర్మించబోతున్నారు. ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ఘనంగా ప్రారంభం కానుంది.

మార్చి నుంచి రెగ్యుల‌ర్‌ షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఇకపోతే ఇందులో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపిక అయింది. తెలుగులో జాన్వీ చేస్తున్న తొలి చిత్ర‌మిది. అయితే ఎన్టీఆర్ 30 తో జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం పట్ల శ్రీదేవి ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుకు కార‌ణం కొర‌టాల శివ‌నే.

మిర్చి మూవీ మినహా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఏ ఒక్క సినిమాలో కూడా హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత దక్కలేదు. రెండు మూడు సన్నివేశాలకు, పాటలకు తప్ప కొరటాల శివ సినిమాలో హీరోయిన్స్ ఎక్కువగా కనిపించరు. ఇప్పుడు ఎన్టీఆర్ 30లోనూ అదే రిపీట్ అయితే.. టాలీవుడ్ ఎంట్రీపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న జాన్వీకి అన్యాయం జ‌రిగిన‌ట్టే అవుతుంది. ఈ నేప‌థ్యంలోనే జాన్వీ కపూర్ మొదటి సినిమా కొరటాల దర్శకత్వంలో కాకుంటే బాగుండేద‌ని శ్రీ‌దేవి అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.