తెలుగు హీరోయిన్ల‌లో ఇంత‌మంది వ్యాధుల‌తో ఉన్నారా… వామ్మో అస‌లేం జ‌రుగుతోంది..!

టాలీవుడ్ హీరోయిన్ల‌కు ఏయమైంది ఇప్పుడు ఎవ‌రిని క‌దిపినా ఏదో ఒక వ్యాధి కామ‌న్ అన్న‌ట్లు క‌నిపిస్తుంది. ఏ స్టార్ హీరోయిన్‌ను చూసిన ఏదో ఒక వ్యాధితో బాధ ప‌డుతు క‌నిపిస్తున్నారు. ఇక ఇప్ప‌టికే తెలుగు స్టార్ హీరోయిన్ అయ‌న స‌మంత‌కు మ‌యోసైటిస్ అనే వ్యాధితో బాధ‌ ప‌డుతుంది. రీసెంట్ గానే అ వ్యాధి నుంచి కోలుకుని స‌మంత వ‌రుస సినిమా షూటింగ్‌ల‌కు జాయ‌న్ అవుతుంది. తాను త్వ‌ర‌లోనే ఖుషి సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతున్నాన‌ని ట్విట్ చేసింది.

మ‌రో హీరోయిన్ పూన‌మ్ కౌర్ కూడా న‌రాల బ‌ల‌హిన‌త వ్యాధితో బాధప‌డుతోంది. ప‌వ‌న్ రెండో భార్య సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్ కూడా తాను కూడా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నానంటూ అంద‌రికి షాక్ ఇచ్చింది. మ‌రో హీరోయిన్ మమతామోహన్ దాస్ కూడా మొదట క్యాన్సర్ వ్యాధితో బాధపడగా.. త‌ర్వాత ఆటోఇమ్యూన్ డిసీజ్‌తో బాధపడుతోంది.

Deepika Padukone replacing Anushka Shetty in Allu Aravind film!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే కూడా డిప్రెషన్‌తో సఫర్ అవుతుంది. ఇక ఇప్పుడు తాజాగా వారిలో నేనున్నానంటూ ఈ లిస్టులోకి అంద‌ల భామ అనుష్క కూడా ఎంట్రీ ఇచ్చింది. త‌న‌కు నవ్వడం మొదలుపెడితే కంట్రోల్‌ చేసుకోవడం తన వల్ల కావడం లేదని అనుష్కనే స్వయంగా వెల్లడించింది. ఇలా ఇప్పుడు రోజుకో హీరోయిన్ కోత్త ర‌క‌మైన వ్యాధితో బాధ‌ప‌డుతు వారి అభిమానుల‌ను అందోళ‌న‌ల‌కు గురి చేస్తున్నారు.