నిన్నేపెళ్లాడ‌తా క్లైమాక్స్ మార్చేయ‌మ‌న్న నాగార్జు… కృష్ణ‌వంశీ ఇచ్చిన ట్విస్ట్ ఇదే..!

ఏ సినిమా అయినా సక్సెస్ అవ్వాలంటే ఎండింగ్, స్టార్టింగ్ చాలా ముఖ్యం. సినిమా సక్సెస్ అవటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ప్రధానంగా స్క్రిప్ట్ దశలో చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఇక సినిమాల నిర్మించే ప్రొడ్యూసర్, లేదా హీరో నుంచి కూడా అనేక మార్పులు రావచ్చు. ముందుగా దర్శకుడు అనుకున్న కథకి హీరో లేదా నిర్మాతలు ఇచ్చిన సలహాలు ఫలించి హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.

Ninne Pelladatha - Disney+ Hotstar

అలాంటి సినిమాల్లో ముందు వరుసలో ఉంటుంది ‘నిన్నే పెళ్ళాడతా’ సినిమా. 1996లో కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. సింధూరం సినిమాతో తనలోని టాలెంట్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసి వరుస‌ సినిమాలకు దర్శకత్వం వహించి సూపర్ విజయాలను తన సొంతం చేసుకున్నాడు దర్శకుడు కృష్ణవంశీ. నాగార్జున వంటి అగ్ర హీరోతో ‘నిన్నే పెళ్ళాడతా’ సినిమా తీసి మరో అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాడు.

Nagarjuna says he's 'not yet' sure what roles work for him as he talks about failure and success: 'If I knew what films to do...'

కృష్ణవంశీ కథ చెప్పిన వెంటనే ఓకే చేసి ఈ సినిమాను తానే స్వయంగా ప్రొడ్యూస్ చేశాడు నాగార్జున. ఈ సినిమా విడుదలయ్యాక మ్యూజికల్ గా సూపర్ హిట్‌గా నిలిచింది. నాగార్జున శివ సినిమాతో టాలీవుడ్ లో ఓ కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేశాడు. అయితే ఈ సినిమా విజయం తర్వాత ఆ రేంజ్‌ హీట్ అందుకోవటంలో నాగార్జున విఫలమయ్యాడు. చాలా ఏళ్ల పాటు వరుస పరాజయాలు చవిచూశాడు. శివ రెంజ్‌ విజయం అందు కోవడానికి నాగార్జునకి చాలా సమయం పట్టింది.

ఆ సమయంలోనే ‘నిన్నే పెళ్ళాడతా’ సినిమా నాగార్జున కెరీర్‌లోనే అతిపెద్ద విజయంగా నిలిచింది. కృష్ణవంశీ.. గులాబీ సినిమా చేస్తున్న సమయంలోనే ఒక సినిమా చేయాలని నాగార్జున రిక్వెస్ట్ చేయడంతో వంశీ దానికి ఓకే చెప్పాడు. రాంగోపాల్ వర్మ శిష్యుడుగా ఉన్న కృష్ణ‌వంశీ, నాగార్జునతో ఈజీ గానే పరిచయం పెంచుకున్నాడు. సినిమా మొత్తం లవ్ మరియు కుటుంబ నేపథ్యంలో తెరకెక్కడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది.

ఈ సినిమా క్లైమాక్స్ చేయడానికి ఎవరు ఊహించని విధంగా అనుకొని సంఘటన ఎదురైంది. ఈ సినిమా క్లైమాక్స్ తెరకెక్కించే సమయంలో నాగార్జున, కృష్ణవంశీని పిలిచి ఒకసారి ఈ క్లైమాక్స్ ఎలా చేయాలనుకుంటున్నారో చెప్పండి అని అడిగాడు. మొత్తం విన్నాక క్లైమాక్స్ మార్చాలని నాగార్జున చెప్పాడు. సినిమా మొత్తం లైటర్ వేలో ఉన్న సమయంలో సీరియస్ గా క్లోజ్ చేస్తే బాగుంటుందని నాగార్జున చెప్పాడు. మామూలుగానే ఎవరి మాట వినని కృష్ణవంశీ రాత్రికి రాత్రే ఒక క్లైమాక్స్ ని రెడీ చేసి నాగార్జున కి చెప్పి మరి ఓకే చేయించుకుని క్లైమాక్స్ ని తెరకెక్కించాడట. ఆ విధంగా ఈ సినిమా క్లైమాక్స్ మార్చడం వల్లే హిట్ అయిందని కృష్ణవంశీ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.