వాలంటైన్స్ డే స్పెష‌ల్‌.. రానాకు రొమాంటిక్ గా ప్ర‌పోజ్ చేసిన స‌తీమ‌ణి!

నేడు వాలంటైన్స్ డే అన్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా టాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు రానా ద‌గ్గుబాటికి.. ఆయ‌న స‌తీమ‌ణి మిహీక బజాజ్ సూప‌ర్ రొమాంటిక్ గా ప్ర‌పోజ్ చేసింది. పింక్ క‌ల‌ర్ షార్ట్ ఫ్రాక్ట్ లో భర్తను హ‌త్తుకుని దిగిన ఫోటోను సోష‌ల్ మీడియాలో పంచుకున్న మిహీక‌.. రానాపై తనకు ఉన్న ప్రేమను వివ‌రించింది.

 

`నేను స్ట్రాంగ్, స్వీట్, వైల్డ్ ఇంకా వండర్ ఫుల్.. ఇలా నా గురించి చెప్పుకుంటూ పోతే పదాలు సరిపోవు. అందుకే నువ్వు నన్ను ఇంతగా ప్రేమించడం లో ఆశ్చర్యం లేదు.. జస్ట్ కిడ్డింగ్. రోజంతా నువ్వు నన్ను విసిగించినా నీ చిరునవ్వే మళ్ళీ ప్రేమలో పడేలా చేస్తుంది. హ్యాపీ వాలంటైన్స్ డే` అంటూ మిహీక ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింటి.

ఈ పోస్ట్ ఇప్పుడు నెటిజ‌న్ల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది. కాగా, రానా-మిహీక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2020లో స‌డెన్ గా ప్రేయ‌సిను ప‌రిచ‌య‌డం చేసి అంద‌రినీ స‌ర్‌ప్రైజ్ చేసిన రానా.. అదే ఏడాది ఆమెతో ఏడ‌డుగులు వేశాడు. క‌రోనా కార‌ణంగా రామానాయుడు స్టూడియోలో అతి త‌క్కువ మంది స‌మ‌క్షంలో వీరి వివాహ మహోత్సవం ఘ‌నంగా జ‌రిగింది. అప్ప‌ట్లో వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొట్టాయి.

https://www.instagram.com/p/CooKs2wIjTu/?utm_source=ig_web_copy_link