తెలుగు డైరెక్టర్లు చేసిన పనికి బాగా డిసప్పాయింట్ అయిన రాశి ఖన్నా ఫ్యాన్స్??

 

బబ్లీ హీరోయిన్ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో, అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న తెలుగు హీరోయిన్స్ లో రాశి ఖన్నా కూడా ఒకరు. నిజానికి రాశి ఖన్నా చాలా అందంగా ఉంటుంది. అయినప్పటికీ ఆమె ఖాతాలో సరైన హిట్స్ పడడం లేదు. దాంతో ఆమె స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదగలేక పోతోంది.

ఇప్పటికే బాలీవుడ్‌లో రెండు వెబ్ సిరీస్ లలో నటించినా రాశి ఖన్నా కి సరైన బ్రేక్ రాలేదు. దాంతో రాశి ఖన్నా కీలక పాత్రలో నటించిన, రాజ్ నిడిమోరు, కృష్ణ డీ. కే లు డైరెక్ట్ చేసిన ఫర్జీ వెబ్ సీరిస్ వైపు అందరి కళ్లు మళ్లేలా చేసింది. ది ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత నటించిన రాజి పాత్ర లాగానే రాశి పాత్ర కూడా ఉంటుందేమో అని అంత అనుకున్నారు కానీ ఫర్జీలో రాశి కన్నా పాత్ర చాలా పెద్దదే అయినప్పటికీ సమంత చేసినంత రేంజ్ లో రాశి ఖన్నా పాత్ర లేదని మన తెలుగు డైరెక్టర్స్ పై ఫ్యాన్స్ డిసప్పాయింట్ వ్యక్తం చేస్తున్నారు. .

అయితే రాజీ పాత్రలో రాశి ఖన్నా ఫేక్ రోల్ పోషించించడమే కాకుండా కొన్ని ఆశ్చర్యకరమైన సన్నివేషాల్లో కూడా నటించింది. అంతేకాకుండా సిరీస్‌లో షాహీద్ కపూర్ తో రొమాంటిక్ సీన్స్‌లో భాగంగా ఒక లిప్ లాక్ కూడా ఇచ్చింది. అయితే ఆ వెబ్ సిరీస్ లో రాశి ఖన్నా పాత్ర బాగానే ఉంది కానీ ప్రేక్షకులు ఊహించిన రేంజ్ లో మాత్రం లేదని అభిమానులు చింతిస్తున్నారు.