చిత్తూరులో వైసీపీకి హ్యాట్రిక్ మిస్?

చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో వైసీపీ ఆధిపత్యం కొనసాగుతున్న విషయం తెలిసిందే. జిల్లాలో పూర్తి ఆధిక్యం దక్కించుకోవాలని చెప్పి వైసీపీ రాజకీయం చేస్తుంది. గత ఎన్నికల్లో జీలల్లో 14కి 13 సీట్లు వైసీపీ గెలుచుకుంది..కానీ ఈ సారి 14కి 14 సీట్లు గెలుచుకోవాలని వైసీపీ చూస్తుంది. కుప్పంతో సహ అన్నీ సీట్లు గెలుచుకోవాలని చూస్తున్నారు. కానీ వైసీపీకి ఆ పరిస్తితి ఉందా? చిత్తూరులో టి‌డి‌పి బలం పెరగలేదా? అంటే ప్రస్తుత పరిస్తితుల్లో వైసీపీకి 14 సీట్లు గెలుచుకునే అవకాశం ఏ మాత్రం లేదు. టి‌డి‌పి కొన్ని సీట్లలో బలం పుంజుకుంటుంది.

కాకపోతే జిల్లాలో ఆధిక్యం వైసీపీకే దక్కే ఛాన్స్ ఉంది గాని..టి‌డి‌పి కూడా కొన్ని సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంది. అందులోనూ ఈ సారి వైసీపీకి హ్యాట్రిక్ మిస్ అయ్యే సీట్లు కొన్ని ఉన్నాయి. అంటే గత రెండు ఎన్నికల్లో గెలుస్తున్న సీట్లలో ఈ సారి వైసీపీకి గెలుపు అవకాశాలు తగ్గాయని చెప్పవచ్చు. అలా వైసీపీకి హ్యాట్రిక్ మిస్ అవ్వడానికి దగ్గరగా ఉన్న సీట్లలో నగరి ముందు ఉంది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి రోజా గెలుస్తున్నారు. కానీ ఈ సారి అక్కడ గెలుపు అవకాశాలు తక్కువ క్లానిపిస్తున్నాయి.

అటు పీలేరులో కూడా అదే పరిస్తితి కనిపిస్తుంది. ఈ సారి అక్కడ వైసీపీ గెలుపు కష్టమని పలు సర్వేల్లో తేలింది. ఇక పలమనేరు సీటులో కూడా అలాంటి పరిస్తితి కనిపిస్తుంది. అలాగే మదనపల్లె సీటులో కూడా అదే పరిస్తితి ఉందని సర్వేలు చెబుతున్నాయి. కానీ పూతలపట్టు, పుంగనూరు, గంగాధర నెల్లూరు లాంటి సీట్లలో టి‌డి‌పి గెలుపు డౌట్ అనే చెప్పవచ్చు.