`అమిగోస్‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. క‌ళ్యాణ్ రామ్ ఫైన‌ల్ టార్గెట్ ఎంతంటే?

చాలా కాలం త‌ర్వాత `బింబిసార‌` మూవీతో గ‌త ఏడాది స‌క్సెస్ ట్రాక్ ఎక్కిన నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌.. రేపు `అమిగోస్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అవుతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రానికి రాజేంద్రరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రాజేంద్రరెడ్డికి డ‌బ్యూ మూవీ ఇది.

అలాగే ఈ సినిమాతో క‌న్న‌డ బ్యూటీ ఆషికా రంగనాథ్ టాలీవుడ్ కు ప‌రిచ‌యం కాబోతోంది. కళ్యాణ్ రామ్ కెరీర్‌ లోనే తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 10న అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. అయితే తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. క‌ళ్యాణ్ రామ్ గ‌త చిత్రం బింబిసార రూ. 15.60 కోట్ల బిజినెస్ ను అందుకుని టోటల్ రన్ లో రూ. 37.92 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.

 

అయితే అమిగోస్ ఎక్స్ పెరి మెంటల్ మూవీ అవ్వడంతో బిజినెస్ విష‌యంలో బింబిసార‌ను క్రాస్ చేయ‌లేక‌పోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రూ. 9.10 కోట్ల రేంజ్ లో బిజినెస్ జ‌రిగింది. అలాగే వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 11.30 కోట్లకు అమిగోస్ థియేట్రిక‌ల్ రైట్స్ అమ్ముడుపోయాయి. దీంతో క‌ళ్యాణ్ రామ్ ఫైన‌ల్ టార్గెట్ రూ. 12 కోట్లుగా మారింది. అంటే వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మొత్తం మీద ఈ సినిమా రూ. 12 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఏరియాల వారీగా అమిగోస్ బిజినెస్ లెక్క‌ల‌ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం – 3.8 కోట్లు
సీడెడ్ – 1.1 కోట్లు
ఆంధ్రా – 4.2 కోట్లు
——————————-
ఏపీ+తెలంగాణ‌= 9.10 కోట్లు
——————————-

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా – 0.80 కోట్లు
ఓవ‌ర్సీస్‌ – 1.40 కోట్లు
———————————
వ‌ర‌ల్డ్ వైడ్ బిజినెస్‌= 11.30 కోట్లు
———————————