మీకు తెలుసా..ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో గా మారడానికి కారణం..ఆ స్టార్ హీరో నే ..!!

నందమూరి కుటుంబం నుంచి వచ్చిన మూడో తరం హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగారు. గత సంవత్సరం వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పోన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఎన్టీఆర్ స్టార్ హీరోగా మారడానికి బాలకృష్ణ అనే కారణమని చాలా మందికి తెలియదు. ఎన్టీఆర్ విషయంలో బాలకృష్ణ ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.

NTR praises uncle Balakrishna after watching 'Akhanda' - Telangana Today

ఇక ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో టాలీవుడ్‌లో హీరోగాపరిచయం అయ్యాడు. ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో నటించి తొలి సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేసిన `సుబ్బు` సినిమా ఫ్లాప్ అవ్వగా.. వివి వినాయక్ దర్శకత్వంలో నటించిన ‘ఆది’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.

Simhadri, బ్లాక్ బస్టర్ 'సింహాద్రి'కి 15 ఏళ్లు - jr ntrs simhadri movie completes 15 years on july 9 - Samayam Telugu

ఆ సినిమా తర్వాత వచ్చిన అల్లరి రాముడు, నాగ సినిమాలు యావరేజ్ గా నిలవగా .. అదే సమయంలో దర్శక ధీరుడు రాజమౌళితో సింహాద్రి సినిమా చేసి తన తొలి ఇండస్ట్రీ హీట్ అందుకున్నాడు. ఈ సినిమాతోనే నందమూరి అభిమానులలో మాస్ ఇమేజ్‌ను దక్కించుకున్నాడు. రాజామౌళి తండ్రి విజ‌బేంద్ర ప్ర‌సాద్ ఈ క‌థ‌ను ఎన్టీఆర్ బాబాయ్, బాల‌కృష్ణను దృష్టిలో ఉంచుకునీ స్క్రిప్ట్ ను డెవలప్ చేశార‌ట‌.

అందుకే బాలకృష్ణ సింహాద్రి సినిమా పక్కన పెట్టారట... !

ఈ కథలో బాయల్యను హీరోగా పెట్టి ఆయనే దర్శకత్వం వహించాలని కూడా అనుకున్నారు. అనుకున్నట్టు గానే బాలయ్యకు కథ చెప్పగా.. ఆ సమయానికి సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి పవర్ ఫుల్ సినిమాలు చేసిన బాలయ్య ఈ స్టోరీ కి నో చెప్పారట. ఆ త‌ర్వాత ఈ క‌థ రాజ‌మౌళి ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డంతో.. ఆయ‌న త‌న మొద‌టి సినిమా హీరో అయిన ఎన్టీఆర్ తోనే త‌న‌ రెండో సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్ కి అభిమానుల‌లో విపరీతమైన క్రేజ్ కూడా వచ్చింది. మాస్ హీరోగా మంచి ఫాలోయింగ్ కూడా పెంచుకున్నాడు. ఈ విధంగా బాల‌య్య చేసిన ఈ ప‌నితో ఎన్టీఆర్ స్టార్ హీరోగా మారాడు. ఇలా బాల‌కృష్ణ, ఎన్టీఆర్ స్టార్ హీరోగా మారడానికి తన వంతు సాయం చేశాడు.