‘గుడ్డు’తో అమర్నాథ్‌కు రిస్క్..ఇదెక్కడి లింక్!

ఏపీ ఐటీ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ ఎప్పుడు ఏదొక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు. ఆయన మంత్రిగా ఉంటూ కొన్ని నిర్లక్ష్యంగా స్టేట్‌మెంట్స్ ఇవ్వడం వల్ల అది వైసీపీకే రిస్క్ అవుతుంది. ఇప్పటికే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉంటూ రాష్ట్రానికి ఏమి చేయట్లేదని, పెట్టుబడులు తేవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అసలు ఐటీ మంత్రిగా ఎందుకు ఉన్నారో అర్ధం కాలేదనే విమర్శలు ఎదురుకుంటున్నారు.

ఇక ఇటీవల ఆయన కొన్ని స్టేట్‌మెంట్స్ ఇవ్వడం బాగా వివాదమయ్యాయి. పెట్టుబడులని ఆకర్షించడం కోసం దావోస్ ఎందుకు వెళ్ళడం లేదనే ప్రశ్నలు వస్తే..అక్కడ చలి ఎక్కువ ఉంటుందని, స్నానం చేయడానికి కూడా కష్టమని మాట్లాడారు. ఇక దీనిపై ప్రతిపక్షాలు ఓ రేంజ్ లో ఆడేసుకున్నాయి. అదే సమయంలో న్యూట్రల్ గా ఉండే నెటిజన్లు సైతం మంత్రి కామెంట్‌ని పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఆ ట్రోల్స్ నడుస్తుండగానే..తాజాగా హైదరాబాద్ లో జరుగుతున్న కారు ఈ-రేసుకు మంత్రి అమర్నాథ్ కూడా వెళ్లారు. అయితే తెలంగాణలో రేసు జరుగుతుంది కదా..మరి ఏపీలో ఎప్పుడు జరుగుతాయని, మంత్రి అమర్నాథ్‌ని మీడియా వాళ్ళు ప్రశ్నించారు.

దానికి కోడి..డైరక్ట్ కోడిని పెట్టలేదని, కోడి గుడ్డు పెట్టాలి..దాన్ని పొదగాలి అంటూ ఏదో గుడ్డు సామెత చెప్పారు. దీనిపై నెటిజన్లు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. మరి మన ఏపీ ఎప్పుడు గుడ్డు పెడుతుందని సెటైర్లు పేలుస్తున్నారు. కారు రేసులు లాంటివి తీసుకురావడానికి కూడా గుడ్డు అంటూ ఐటీ మంత్రి కథలు చెబుతున్నారని, ఇలాంటి మంత్రి ఎందుకు ఉన్నారని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అయితే ఇలాంటి కామెంట్స్ వైసీపీ ప్రభుత్వానికే నష్టం చేసేలా ఉన్నాయి. ఇటు మంత్రిగా అమర్నాథ్‌కు డ్యామేజ్ తప్పేలా లేదు.