అమర్నాథ్‌కు సీటు కష్టాలు..విశాఖ వైసీపీలో రచ్చ..!

ఏపీ రాజకీయాల్లో అధికార వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాయకుల్లో ఒకరిగా ఉన్న మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు సీటు కష్టాలు ఉన్నాయా? వచ్చే ఎన్నికల్లో ఆయనకు అనకాపల్లిలో గెలుపు ఈజీ కదా? అందుకే సీటు మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? అంటే ప్రస్తుతం విశాఖ రాజకీయాల్లో నడుస్తున్న చర్చ బట్టి చూస్తే అవుననే అనిపిస్తుంది. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన గుడివాడ..2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరి..ఆ ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

2019 ఎన్నికల్లో అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇక లక్కీగా రెండోవిడతలో మంత్రి పదవి కూడా దక్కింది. ఇక మంత్రి అయ్యాక..చంద్రబాబు, పవన్‌లని టార్గెట్ చేసి ఏ స్థాయిలో తిడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. ఆయన శాఖలకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడం కంటే పవన్‌ని తిట్టడంపైనే ఎక్కువ ఫోకస్ చేశారు. ఇలా రాజకీయంగా ఫైర్ బ్రాండ్‌గా ఉన్న గుడివాడకు ఈ సారి అనకాపల్లిలో గెలుపు కష్టమే అని సర్వేలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన నియోజకవర్గాన్ని మార్చాలని చూస్తున్నారని టాక్ నడుస్తోంది.

ఇదే క్రమంలో ఆయన ఎలమంచిలిపై ఫోకస్ పెట్టారని..అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు మాటల్లో తెలుస్తోంది. అందుకే ఇటీవల ఆయన స్థానికుడుకే సీటు ఇవ్వాలని..తనకు సీటు ఇవ్వకపోతే తన కుమారుడుకు ఇవ్వాలని లేదంటే స్థానిక నాయకుడుకే సీటు ఇవ్వాలని, కానీ బయట నుంచి వచ్చేవారికి సీటు ఇస్తే ఊరుకునేది లేదన్నట్లు మాట్లాడుతున్నారు.

అంటే ఎలమంచిలిపై అమర్నాథ్ ఫోకస్ చేయడంతోనే కన్నబాబు రాజు ఫైర్ అవుతున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఎలమంచిలి కాకపోతే గాజువాక షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నారనే ప్రచారం ఉంది. ఇలా అమర్నాథ్‌కు సీటు విషయంలో కష్టాలు కొనసాగుతున్నాయి. ఈయన సీటు అంశం విశాఖ వైసీపీలో చిచ్చు రేపుతుంది. అయితే టీడీపీ-జనసేన కలిస్తే అమర్నాథ్‌కు గెలుపు కష్టమనే చెప్పాలి.