అక్కడ చిరంజీవిపై కోడిగుడ్లు విసరడానికి కారణం..?

తెలుగు ఓటీటి సెలబ్రెటీలు స్పెషల్ టాక్ షోలు ఈ మధ్యకాలంలో ఒక రేంజ్ లో బ్లాక్ బాస్టర్ హిట్టుగా కొనసాగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇదే తరహాలో ట్రాక్షులను మొదలు పెడుతున్నారు ఎంటర్టైన్మెంట్ సంస్థలు. కాస్త భిన్నంగా ఆలోచిస్తూ విభిన్నమైన టైటిల్తో షోలకు రూపకల్పన చేస్తున్నారు. ఇటీవల తెలుగులో ఆహ అన్ స్టాపబుల్ షోని మొదలుపెట్టారు. ప్రస్తుతం విజయవంతంగా రెండు సీజన్లను పూర్తిచేసుకుంది. తాజాగా ఆహా ఓటీటి బాటలోనే సోనీ లీవ్ కూడా ఒక కొత్తగా స్మిత హోస్టుగా నిజం విత్ స్మిత అనే పేరుతో ఒక సెలబ్రిటీ షోకు శ్రీకారం చుట్టింది.

ఇందులో మొదటి ఎపిసోడ్ ఫిబ్రవరి 10వ తేదీన స్ట్రిమింగ్ కాబోతోంది. ఈ షో కి సంబంధించి మొదటి ఎపిసోడ్ ని కష్టేఫలి అనే పేరుతో చిరంజీవిని గెస్ట్ గా ఇ షోకి పిలవడం జరిగింది. తొలి ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమోని బుధవారం విడుదల చేశారు. ఇప్పటికే సాయి పల్లవి, రానా, నానీలకు సంబంధించి ప్రోమోని కూడా విడుదల చేసి ఆసక్తిని పెంచేలా చేశారు సోనీ లీవ్.

ఇక చిరంజీవి ఫస్ట్ ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమో ప్రారంభంలో చిరంజీవి షోలోకి ఆహ్వానించిన స్మిత తన కాలేజ్ డేస్ ని..మీ ఫస్ట్ క్రష్ ఏంటి అని అడిగారు.. చిరంజీవి సమాధానం చెప్పాలా వద్దా అని సందిగ్ధంలో వెళ్లిపోయారు. ఆ తర్వాత స్టార్డం అనేది కొంతమందికే ఒక స్టేజ్ కి వెళ్లాలంటే అవమానాలు అంటూ ప్రశ్న అడగడం మొదలుపెట్టింది.. చిరంజీవి చెబుతూ జగిత్యాలలో తన పైన పూల వర్షం కురుస్తోంది ..అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే కోడిగుడ్లు తీసుకొని కొట్టారు అనే విషయాన్ని కూడా బయటపెట్టారు చిరంజీవి ప్రస్తుతం అందుకు సంబంధించి ప్రోమో వైరల్ గా మారుతోంది.

https://twitter.com/smitapop/status/1622945410993074176?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1622945410993074176%7Ctwgr%5Efaa6a2dc964a912f533f9ffe657920a258cd418d%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fadmin.tupaki.com%2Fpolitical-newsupload.php%3Fnid%3D359673