నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ `ఆహా` వేదికగా `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` అనే టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అల్రెడీ ఈ షో ఫస్ట్ సీజన్ ను విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. సెకండ్ సీజన్ కూడా తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు ఈ షోలో సందడి చేశారు.
అయితే నందమూరి అభిమానులు బాబాయ్ షోలో అబ్బాయిలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సందడి చేస్తే చూడాలని ఎప్పటినుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఆ తరణం మాత్రం రావడం లేదు. అయితే తాజాగా` అన్ స్టాపబుల్`కు ఇంతవరకు ఎందుకు రాలేదు అన్న విషయంపై కళ్యాణ్ రామ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
మరో రెండు రోజుల్లో కళ్యాణ్ `అమిగోస్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ రామ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. అక్కడ బాలయ్య టాక్ షో గురించి ప్రస్తావన వచ్చింది. ఆహా ఓటీటీ నుంచి `అన్ స్టాపబుల్`కు పిలుపు రాలేదని.. ఆ రీజన్ వల్లే ఎన్టీఆర్, తాను ఆ షోలో పాల్గొనలేదని స్పష్టం చేశారు. దీంతో మూడో సీజన్ లో అయినా వీరిద్దరూ బాబాయ్ షోలో సందడి చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.