కళ్యాణ్ రామ్ పచ్చబొట్టు వెనుక ఆసక్తికరమైన విషయం ఇదే..!!

బింబీసారా చిత్రంతో కళ్యాణ్ రామ్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారని చెప్పవచ్చు. ఇందులో డబుల్ రోల్ లో ఆకట్టుకున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు ఆమీ గోస్ చిత్రంలో ఏకంగా త్రిపాత్రాభినయంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా అన్ని హంగులు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం తన సినిమా షూటింగ్ ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉన్నారు కళ్యాణ్ రామ్. ఈ సందర్భంగా ఆమీ గోష్ సినిమాతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకోవడం జరిగింది.

kalyan ram tattoo : త‌న టాటూ సీక్రెట్ బ‌య‌పెట్టిన క‌ళ్యాణ్ రామ్

కళ్యాణ్ రామ్ తాజాగా తన భార్య స్వాతి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు తన పేరును చేతిపై పచ్చబొట్టుగా వేయించుకోవడానికి గల కారణాన్ని కూడా రీవీల్ చేయడం జరిగింది. 2008 సంవత్సరంలో తానం చాలా అనారోగ్య సమస్య బారిన పడ్డానని ఆరోగ్యం బాగా చెడిపోయిందని సాధారణంగా ఈ సమయంలో భర్త పట్ల ఎక్కువగా కేర్ తీసుకుంటారు. కొందరు నర్సులను పెట్టి చూసుకోమని చెబుతూ ఉంటారు.. కానీ తన విషయంలో మాత్రం నర్సులను కూడా వద్దని తన భార్య తనకు దగ్గరుండి చూసుకుందని తెలిపారు కళ్యాణ్ రామ్.

ఇక తన కేరింగ్ లో తనని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్దని తన భార్య గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఇక తన పదోవ పెళ్లి సంవత్సరం రోజున నీకు ఏదైనా కావాలి ఏదైనా ఇస్తానని అడిగానని కానీ తను మాత్రం నాకేమీ వద్దు నాకు అన్నీ ఉన్నాయి.. పక్కన మీరు పిల్లలు ఉన్నారు ఇంతకుమించి ఏం కావాలని చెప్పిందట .తన భార్యపై ఉన్న ప్రేమతో తన పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నాను అసలు నాకు సూది మందు అంటేనే చాలా భయం ఇంజక్షన్ చేయించుకోవాలన్నా చాలా భయపడిన వాడిని అలాంటిది ఆమె మీద ప్రేమతో ఇలా పచ్చబొట్టు వేయించుకున్నానని తెలిపారు కళ్యాణ్ రామ్.