ఎవరండీ ‘లోకేష్’..పాదయాత్రని పట్టించుకోని వైసీపీ..!

జనవరి 27 నుంచి లోకేష్ పాదయాత్ర మొదలుపెడుతున్న విషయం తెలిసిందే. కుప్పంలో మొదలుకానున్న ఈ పాదయాత్ర 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు జరగనుంది..అలాగే ఇచ్చాపురంలో ముగియనుంది. అయితే రాజకీయాల్లో పాదయాత్ర అనేది ప్రతి పార్టీకి బూస్ట్ ఇచ్చేదని చెప్పాలి. గతంలో వైఎస్సార్, చంద్రబాబు, జగన్..పాదయాత్రలు చేసే తమ పార్టీలని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు లోకేష్ సైతం పాదయాత్ర చేసి టీడీపీని అధికారంలోకి తీసుకోస్తారని, ఆ పార్టీ శ్రేణులు నమ్ముతున్నాయి.

అయితే లోకేష్ పాదయాత్రని ప్రజలు పట్టించుకోరని, ఆయన ప్రజలకు సమస్యలు ఏం ఉన్నాయి..తమ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అసలు నారా లోకేష్ పాదయాత్రను రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తేలిగ్గా కొట్టిపారేశారు. నారా లోకేష్ ఎవరండి? హు ఈజ్ లోకేష్.. అని ప్రశ్నించారు. ఎప్పుడైనా అసెంబ్లీకి ఎన్నికయ్యారా? పంచాయతీ సర్పంచ్ అయ్యారా? వార్డ్ మెంబర్ అయ్యారా?.. అని ప్రశ్నించి..నామినేట్ చేస్తే పదవిలోకి వచ్చారని, ఆయన గురించి తాము ఆలోచన చేసేది ఏంటని  తేల్చి చెప్పారు.

ఈయనే కాదు పలువురు నేతలు సైతం లోకేష్ పాదయాత్రని తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు. అయితే లోకేష్ పాదయాత్రతో తమకు నష్టం లేదు అనుకుంటే..పాదయాత్రకు పూర్తిగా పర్మిషన్ ఇవ్వవచ్చు కదా..పాదయాత్రకు ఎలాంటి అడ్డంకులు సృష్టించుకుండా ఉండాలని టీడీపీ శ్రేణులు రివర్స్ లో ప్రశ్నిస్తున్నాయి. ప్రభావం లేదు అనుకుంటే పాదయాత్రపై ఆంక్షలు ఎందుకు అంటున్నారు.

ఇక లోకేష్ పాదయాత్ర ప్రభావం ఉంటుందో లేదో ప్రజలు తేలుస్తారని, వారికి కష్టాలు ఉన్నాయో అధికారంలో ఉండే వైసీపీ వాళ్ళకు తెలియదని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. మొత్తానికి లోకేష్ పాదయాత్ర ఎలా ముండూకెళుతుందో చూడాలి.