ఆ హీరోకి రూ .100 కోట్లు ఇచ్చి ఏం లాభం..!!

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎటువంటి సినిమాలను తీసుకొచ్చినా సరే అందులో తప్పకుండా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఎన్నో అంశాలు తప్పకుండా ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో ఆయన మాత్రం స్టార్ హీరోలు డేట్స్ ఇస్తూ ఉండడంతో కమర్షియల్ ఫార్మేట్ లోనే సేఫ్ జోన్ లో వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పూర్తిస్థాయిలో కొన్ని కమర్షియల్ చిత్రాలు అంతగా సక్సెస్ అవ్వలేకపోతున్నాయి. తాజాగా దిల్ రాజు విజయ్ తో వారసుడు సినిమా చేయడంతో తెలుగు రాష్ట్రాలలో లాభాలు రావడం కష్టంగా మారింది.

తమిళంలో ఈ సినిమా మొత్తం థియేటర్ హక్కులను అమ్మేసి సేఫ్ జోన్ లోకి వచ్చినప్పటికీ.. తెలుగులో మాత్రం చాలా ఏరియాలో సొంతంగా విడుదల చేశారు దిల్ రాజు.నిజానికి రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు రోజుల్లో రూ. 6.4 కోట్ల షేర్ కలెక్షన్ వసూల్ చేసింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకొని రూ. 14 కోట్ల రేంజ్ లో బిజినెస్ అయితే చేసింది. కానీ రూ. 15 కోట్ల బ్రేక్ ఈవెన్ అందుకుంటేనే ఈ సినిమా లాభంలోకి వచ్చినట్లు. ఇప్పటివరకు వారసుడు సినిమా కేవలం రూ.6.4 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. అయితే ఈ సినిమా తెలుగులో సక్సెస్ కావాలి అంటే రూ.8.6 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబటాల్సి ఉంటుంది.

ఇకపోతే విజయ్ కి రూ.100 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చిన దిల్ రాజు.. కనీసం ఒక్కరోజు తెలుగులో చిన్న మీటింగ్ పెట్టినా కూడా కలెక్షన్స్ చాలా పెరిగేవి. నిజానికి విజయ్ కి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. అతడు కూడా ఇటువైపు కాస్త ఫోకస్ చేసిన కూడా కలెక్షన్లు పెరిగేవి. కానీ అతడేమో తెలుగుపై అసలు ఎలాంటి రియాక్షన్ చూపించడం లేదు. దానికి తోడు దిల్ రాజు కూడా మిగతా వాళ్లతో అంతగా ప్రమోషన్స్ ఏమీ చేపించలేదు. అందుకే సినిమా తెలుగు రాష్ట్రాలలో నష్టాలను చవిచూస్తోందని చెప్పవచ్చు.