సౌత్ లో నెంబర్ వన్ హీరో అతనేనా..?

ఆల్ ఇండియా సినిమాలతో సత్తా చాటుతున్న సౌత్ సినీ పరిశ్రమ లో టాప్ సెలబ్రిటీ ఎవరు అడిగితే చెప్పడం చాలా కష్టమని చెప్పవచ్చు. ఒకవైపు తెలుగు హీరోల సినిమాలు నేషనల్ లెవెల్ లో విడుదలవుతూ ఉండగా తమిళ, కన్నడ ,మలయాళం వంటి హీరోలు కూడా వారి సినిమాలతో అందరిని మెప్పిస్తున్నారు. తాజాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్..IIHB నిర్వహించిన ఒక సర్వేలో సౌత్ ఇండియాలో టాప్ సెలబ్రిటీగా తమిళనాడు సూర్య నిలవడం గమనార్హం. కోలీవుడ్లో విలక్షణమైన నటుడుగా పేరు సంపాదించుకున్న సూర్య గత సంవత్సరం నేషనల్ అవార్డును కూడా అందుకున్నారు.

Pin on Suraya
ఇప్పుడు ఈ సర్వేలో కూడా టాప్ వన్ గా నిలిచారు. విక్రమ్ సినిమాలో కమలహాసన్ అదరగొట్టేశారు కానీ చివరి ఐదు నిమిషాలలో రోలెక్స్ పాత్రలో సూర్య అద్భుతమైన నటనను ప్రదర్శించారు. డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించిన..ఈ పాత్రకు పేరు తెచ్చి పెట్టాడు సూర్య. అందుకే IIHB సర్వీసులు టాప్ ప్లేస్ లో నిలిచారు.ఇక భాషలపరంగా చూస్తే తమిళంలో సూర్యనే టాప్ కాక.. తెలుగులో అల్లు అర్జున్ టాప్ ప్లేస్ లో ఉన్నారు. పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ మాస్ యాటిట్యూడ్ ఫ్యాన్స్ కి పూనకాల తెప్పించే విధంగా ఉన్నాయి. ఇక తర్వాత రెండో ప్లేస్ లో విజయ్ దేవరకొండ తమిళంలో సూర్య తర్వాత విజయ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు.

IIHB సర్వే లిస్టులో 18 మంది సెలబ్రెటీలు ఉన్నారుఇందులో ఆరుగురు హీరోలు తెలుగు నుంచి తమిళం నుంచి మరొక ఆరు హీరోలు కనడ నుంచి ఇద్దరు మలయాలం నుంచి నలుగురు సెలబ్రిటీలు ఈ లిస్టులో ఉన్నారు. అయితే ఈ సర్వే గత ఏడాది డిసెంబర్లో జరిగింది ప్రతి ఏడాది కూడా ఈ సర్వే నిర్వహిస్తోంది IIHB సంస్ధ.