బిచ్చగాడు హీరోకి తీవ్రమైన గాయాలు.. కారణం ఏమిటంటే..?

టాలీవుడ్ లో ఏ సినిమా ఎలా ఆడుతుందో ఎవరు ఊహించి చెప్పలేము. ఇక అలా ఎన్నో సినిమాలు సైలెంట్ గా వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. అలా సైలెంట్ గా వచ్చి అందుకున్న చిత్రాలలో బిచ్చగాడు సినిమా కూడా ఒకటి. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషలలో విడుదలై సెన్సేషనల్ హిట్టుగా నిలిచింది.ఈ చిత్రంతో హీరోగా విజయ్ ఆంటోని మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అంతకుముందు విజయ్ కొన్ని చిత్రాలలో నటించినప్పటికీ కానీ విజయ్ ఆంటోని అంటే ఎవరో చాలామందికి తెలియకపోవచ్చు. కానీ బిచ్చగాడు తర్వాత విజయ్ ఆంటోని ఒక్కసారిగా మంచి పాపులారిటీ సంపాదించారు.

Vijay Antony to don khaki for the first time in 'Thimiru Pudichavan' | The  News Minuteఅయితే ఈ హీరో క్రేజీకి తాజాగా ఒక దురదృష్ట సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.విజయ్ ఆంటోని తన తదుపరిచిత్రం షూటింగ్లో ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ ఆంటోని ప్రస్తుతం బిచ్చగాడు -2 సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ చిత్రం షూటింగ్ మలేషియాలో జరుగుతున్నట్లు సమాచారం. షూటింగ్ జరుగుతూ ఉండగా విజయ్ ఆంటోని తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో చిత్ర యూనిట్ అతడేకి మలేషియాలను ఒక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం విజయ్ కండిషన్ బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో హుటాహుటిగా విజయ్ ఆంటోని కుటుంబ సభ్యులు మలేషియా కు బయలుదేరినట్లు సమాచారం . బోటులో ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తమిళ మీడియా నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.విజయ్ బోట్లో ప్రయాణిస్తున్నప్పుడు పక్కన వేరే పడవలో కెమెరామెన్ ఇతర సిబ్బంది చిత్రీకరిస్తున్నారు వేగంగా ప్రయాణిస్తున్న బోటు ఒకసారిగా అదుపుతప్పడంతో పడవని ఢీ కొట్టినట్లుగా తెలుస్తోంది .దీంతో ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. దీంతో విజయ్ ఆంటోని అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు.