విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్‌కే..గద్దెతో ఈజీ కాదా?

నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారం దక్కించుకోవాలనే దిశగానే జగన్ రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. నెక్స్ట్ ఎన్నికల్లో గెలిస్తే చాలు మరో 30 ఏళ్ల పాటు అధికారంలోకి ఉండవచ్చని అంటున్నారు. అంటే జగన్ ప్లాన్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటినుంచే అసెంబ్లీ స్థానాల్లో బలమైన అభ్యర్ధులని ప్రకటిస్తున్నారు.

ఇదే క్రమంలో తాజాగా టీడీపీ చేతుల్లో ఉన్న విజయవాడ ఈస్ట్ స్థానంలో వైసీపీ అభ్యర్ధిగా దేవినేని అవినాష్‌ని ప్రకటించారు. అవినాష్..వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని, ఆయనని గెలిపించాలని కార్యకర్తలకు జగన్ దిశానిర్దేశం చేశారు. అయితే ప్రస్తుతం అక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ ఉన్నారు. వివాదాలకు అతీతంగా ఉంటూ..నిత్యం ప్రజల మధ్యలో ఉండే గద్దెకు నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. ఇటు దేవినేని అవినాష్‌కు కూడా తూర్పుపై పట్టు ఉంది. గతంలో ఇక్కడ అవినాష్ తండ్రి దేవినేని నెహ్రూ సత్తా చాటారు.

తూర్పుపై దేవినేని ఫ్యామిలీకి పట్టు ఉంది. పైగా అవినాష్ వైసీపీలోకి వెళ్ళాక..తూర్పులో ప్రజలకు అండగా ఉంటున్నారు. సొంత డబ్బులు సైతం ఖర్చు పెడుతూ పనులు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలని చూస్తున్నారు. అయితే గద్దె-దేవినేనిల మధ్య టఫ్ ఫైట్ జరిగే అవకాశాలు ఉన్నాయి.

అదే సమయంలో ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది..తూర్పులో జనసేనకు బలం ఉంది. ఒకవేళ గాని టీడీపీతో జనసేన పొత్తు ఉంటే..అవినాష్‌కు రిస్క్ పెరుగుతుంది. ఆయన గెలుపు అంత ఈజీ కాదని విశ్లేషకులు అంటున్నారు. మరి చూడాలి నెక్స్ట్ తూర్పులో ఎవరు గెలుస్తారో.