టాలీవుడ్ సినీయర్ హీరో నందమూరి బాలకృష్ణ చాలా ముక్కుసూటిగా ఉంటాడు. తన మనసులో ఏది అనిపిస్తే అది అనేస్తాడు. తనకు ఏది నచ్చితే అదే చేస్తాడు. ఎవరితో అయినా తేడా వస్తే వారిని దూరం పెట్టేస్తాడు. అదే సమయంలో తనకు కంఫర్ట్ ఇచ్చే వాళ్లతో మళ్ళీ మళ్ళీ పనిచేస్తుంటాడు. ఈ క్రమంలోనే తన సినిమా షూటింగ్ సమయంలో కూడా బాలకృష్ణ ఎంతో కూల్ గా ఉంటాడు. డైరెక్టర్ ఏది చెప్తే అది చేస్తాడు.
ఇక ప్రస్తుతం వీర సింహారెడ్డి సినిమా విషయంలో మాత్రం తనకు నచ్చిన కెమెరా మ్యాన్ ని పక్కన పెట్టి తనకు నచ్చని మరో కెమెరా మ్యాన్ ని తీసుకున్నారట. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న వీర సింహారెడ్డి సినిమాకు రిషి పంజాబీ కెమెరామెన్ గా ఉన్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో బాలకృష్ణ కి అతనికి ఏదో తేడా కొట్టిందట.
వారి మధ్య గొడవ అంటూ ఏమీ లేదు కానీ బాలయ్య శైలికి రిషి కరెక్ట్ కాదని బాలయ్య ఫీలయ్యాడట. దీంతో రామ్‌ప్రసాద్‌ను రప్పించి కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ బాధ్యత అప్ప చెప్పారట. బాలయ్య మొండితనం ఎలాంటిదో తెలిసిందే కాబట్టి దర్శక నిర్మాతలు ఎవరు ఎదురు చెప్పలేదట. రామ్‌ప్రసాద్ కెమెరా మెన్ గా వచ్చిన దగ్గర నుంచి రిషి పంజాబీ చాలా వరకు బాలయ్య లేని సన్నివేశాలనే చిత్రీకరించారట.
బాలీవుడ్‌లో పేరున్న కెమెరామన్ అయిన రిషికి ఇది ఎంతమాత్రం రుచించకపోయినా సర్దుకుపోయినట్లు సమాచారం. ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసినపుడు కూడా రిషి ఈ విషయం ఎక్కడా ప్రస్తావించలేదు. కూల్‌గానే కనిపించాడు. ‘వీరసింహారెడ్డి’ ఫైనల్ ఔట్ పుట్ చూస్తే.. రిషి, రాం ప్రసాద్ తీసిన సన్నివేశాల మధ్య విజువల్‌గా తేడాను గమనించవచ్చని అంటున్నారు.