సౌత్ ఇండస్ట్రీలో అత్యంత ధనవంతులైన హీరోయిన్లు వీళ్లే…!

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎందరో హీరోయిన్లు చిత్ర పరిశ్ర‌మ‌లో కొనసాగుతున్నారు. ఇక వారిలో కొందరు అగ్ర హీరోయిన్లుగా అన్ని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. వారిలో కొందరు స్టార్ హీరోలను మించి తమ ఆస్తులను సంపాదించుకున్నారు. ఇక అలా వారిలో టాప్6 ధనవంతులైన హీరోయిన్లు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

నయనతార:
సౌత్ ఇండియా సినిమా పరిశ్రమంలోనే లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను తెచ్చుకొని. స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ సినిమాలు చేస్తుంది. ఇక సౌత్ ఇండియా ఫిలిమ్‌ ఇండస్ట్రీలో అత్యంత ధనవంతుల జాబితాలోనే నయనతార పేరు మొదటి స్థానంలో ఉంటుంది. ఇక నయనతార ఆస్తులు విలువ దాదాపు రూ.165 కోట్ల వరకు ఉంటుంది.

త‌మ‌న్నా:
ఇక నయనతార తర్వాత స్థానంలో మిల్కీ బ్యూటీ తమన్నా రూ.110 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో కొనసాగుతుంది. 15 సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న తమన్నా ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా వరుస‌ సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది.

అనుష్క‌:
ఇక బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోయిన్‌గా సూపర్ క్రేజ్‌ తెచ్చుకున్న అనుష్క శెట్టి కూడా సౌత్ ఇండియా ఫిలిమ్‌ ఇండస్ట్రీలోనే అత్యంత సంపన్న నటీమణుల జాబితాలో మూడో స్థానంలో ఉంది. అనుష్క శెట్టి ఆస్తులు విలువ దాదాపు రూ.100 కోట్లకు పై మాటే. ప్రస్తుతం కాస్త సినిమాల‌కు బ్రేక్ ఇచ్చిన అనుష్క త్వరలోనే ప‌లు సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

 సమంత పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. ఇటీవలే పుష్ప ది రైజ్ సినిమాలో ‘ఊ అంటావా..’ అంటూ కుర్రకారును ఉర్రూతలూరించిన సమంత ఆస్తుల విలువ 89 కోట్లు. దీంతో ఆమె సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నాలుగో సంపన్న నటీమణిగా ఉంది.

స‌మంత‌:
టాలీవుడ్ నెంబర్‌వ‌న్ హీరోయిన్ సమంత అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత కొంతకాలం సినిమాలు గ్యాప్ ఇచ్చింది. ఇక సమంత ఆస్తి విలువ కూడా దాదాపు రూ.89 కోట్ల వరకు ఉంటుందట. ఇక ఆమె సౌత్ సినిమా పరిశ్రమలోనే నాలుగో సంపన్న నటిమణిగా పేరు తెచ్చుకుంది.

Rashmika Mandanna or Pooja Hegde: Whom do you want to see Thalapathy Vijay  with on screen? | PINKVILLA

పూజాహెగ్డే, ర‌ష్మిక‌:
పొడుగు కాళ్ళ సుందరి పూజ హెగ్డే కూడా ప్రస్తుతం టాలీవుడ్ టు బాలీవుడ్‌లో వరుస‌ సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌గా కొనసాగుతుంది. ఈమె ఆస్తులు కూడా దాదాపు రూ.50 కోట్లకు పైమాటే సౌత్ సినిమా పరిశ్రమంలో ఉన్న అధిక ధనవంతులైన నటిమ‌ణుల జాబితాలో ఈమె ఐదో స్థానంలోఉంది. నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మికా మందన్నా కూడా ఈ జాబితాలో ఉంది. 28 కోట్ల విలువైన ఆస్తులను కలిగిన రష్మిక త్వరలోనే బాలీవుడ్ సినిమాల‌లో కూడా నటించబోతోంది.