నెగటివ్ కామెంట్స్ పై.. యాక్షన్ ఇచ్చిన శ్రీజ..?

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ఎంతటి ప్రత్యేకమైన స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఈమె ఎలాంటి పోస్ట్ షేర్ చేసిన సరే ఎక్కువగా తన భర్త గురించి ఈమె గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. గడిచిన కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నానంటూ చేసిన పోస్ట్ వల్ల శ్రీజ వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు రకాలుగా వార్తలు వినిపించాయి. గత సంవత్సరం తనకిష్టమైన వ్యక్తి గురించి తెలుసుకున్నానంటూ శ్రీజ పోస్ట్ చేయడం జరిగింది.

ఖమ్మం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పవన్ కళ్యాణ్ అభిమాని చిన్నారి శ్రీజ |  Pawan Kalyan fan srija discharge from hospital - Telugu Oneindia

దీంతో మెగా అభిమానులు, నేటిజన్స్ సైతం ఆ ఇష్టమైన వ్యక్తి ఎవరు.. అనే విషయంపై పలు రకాలుగా వార్తలు వినిపించాయి. ముఖ్యంగా శ్రీజ మూడవ వివాహం చేసుకోబోతోంది అంటూ కూడా వార్తలు వినిపించాయి. ఈ విషయంపై శ్రీజా స్పందిస్తూ.. నేను ఎవరితోనో రిలేషన్ షిప్ లో ఉన్నానని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని శ్రీజ తెలియజేసింది. “ఐ యామ్ లివింగ్ ది రిలేషన్షిప్ విత్ సెల్ఫ్”అంటూ తన ఫోటోతో శ్రీజ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.తాను సెల్ఫ్ రిలేషన్ షిప్ లో ఉన్నానని శ్రీజ స్పష్టత ఇవ్వడంతో ట్రోలర్స్ కామెంట్స్ ఒకసారిగా ఆగిపోయాయి.

మరొకవైపు చిరంజీవి తాజాగా శ్రీజకు రూ.35 కోట్ల రూపాయల ఖరీదైన గిఫ్ట్ ని కూడా ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి శ్రీజ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చిరంజీవి ఇంటిని కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం చిరంజీవి ఒక్క చిత్రానికి రూ.30 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఇక చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా ఈ సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఇక వీటితో పాటే భోళా శంకర్ సినిమాలకు కూడా నటిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sreeja (@sreejakonidela)