బాలయ్య కూతుర్ని ఆకాశానికి ఎత్తేస్తున్న ఫ్యాన్స్… ఇంత క్రేజ్ ఏంటి…?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్ లో సూపర్ క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. వరుస క్రేజీ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ యువ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఇక వీటితోపాటు తను వ్యాఖ్యతగా చేస్తున్న అన్‌ స్టాపబుల్‌ షో తో యూత్‌లో సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇక ఇప్పటికే రెండో సీజన్ కూడా అదిరిపోయే రీతిలో అదరగొడుతున్న బాలయ్య.. ఈ షోలో తన పాత అభిరుచికి భిన్నంగా తన కొత్త మేకోవర్‌లో కనిపిస్తూ నందమూరి అభిమానులను ఖుషి చేస్తున్నాడు.

ఒకప్పుడు బాలయ్య తన హెయిర్ స్టైల్ చాలా క్లియర్ గా విగ్గు అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఆయన హెయిర్ స్టైల్ చాలా నేచురల్ గా ఉండడంతో పాటు బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు డ్రస్ లు వేస్తున్నాడు. ఇక దీంతో బాలయ్య న్యూ లుక్ చూసి ఆయన అభిమానులే కాదు సగటు సినీ అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. ఇక ముఖ్యంగా అన్‌ స్టాపబుల్ షోలో అన్ని విధాలుగా బాలయ్యను అద్భుతంగా చూపిస్తున్నారు.

అయితే బాలయ్య ఇంత న్యూ మె కవర్‌లో కనిపించడానికి పూర్తి బాధ్యత ఆయన చిన్న కూతురు తేజస్విని అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఓ టాక్ నడుస్తుంది. ఇక ఈమె అన్‌ స్టాపబుల్‌ షో కు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తుంది. ఇక సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు రాబోతున్న వీర సింహారెడ్డి సినిమాలో కూడా బాలయ్య ఎంతో కొత్త లుక్ లు అదరగొడుతున్నాడు. ఇప్పటికే ఆ సినిమాపై ఎంతో సూపర్ బజ్ క్రియేట్ అయింది.

 Balakrishna New Look Credit Goes To His Daughter Tejaswini Details, Aha Ott, Bal-TeluguStop.com

ఇక ఈ సినిమాకి అంత పాజిటివ్ టాక్ రావటానికి సినిమాపై ఇన్ని అంచనాలు పెరగడానికి ముఖ్య కారణం కచ్చితంగా తేజస్విని యొక్క స్టైలిష్ మార్క్ అంటూ నందమూరి అభిమానులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలయ్య అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు మరియు మీడియా సర్కిల్స్ వారు కూడా బాలయ్య కూతురు తేజస్విని పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. బాలకృష్ణ ముందు ముందు రాబోయే సినిమాలకు కూడా తేజస్విని వర్క్ చేయాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.